నీ జీవితాన్ని మార్చుకోవాలంటే నీలోని ప్రవర్తన మారిపోవాలని ఎవరు తెలుపగలరు
ప్రవర్తనలో మార్పు వస్తే నీలో నీవే నీకు తెలియకనే మారిపోయి జీవితం మారుతుంది
నీ గుణ భావాలను గమనిస్తూ ఆలోచనల అర్థాలను పరిశీలిస్తూ కార్యాలను సాగించు
ఎదుటి వారికి నచ్చని ప్రవర్తనను మానుకుంటూ నీలో మహా గుణ ప్రవర్తన కలగాలి
నీలో ఎంతటి విచక్షణ స్వభావం ఉంటుందో నీ జీవితం అంతటి గొప్పగా సాగుతుంది
No comments:
Post a Comment