కలం తీసుకోవటమే గాని కొందరు తిరిగి వారికి ఇవ్వటం లేదు
ఇచ్చిన వారు ఇస్తారని వేచి మరచిపోయినా తీసుకున్న వారు ఇవ్వలేరు
తీసుకున్న వారు ఇవ్వాలనుకున్నా ఇచ్చిన వారు కంగారుగా వెళ్ళిపోయారు
ఇచ్చిన వారికంటే తీసుకున్న వారే తిరిగి ఇచ్చేలా వీలు కల్పించు కోవాలి
కలం యొక్క విలువ ఏదైనా వ్రాసుకోవాలనే సమయంలోనే తెలుస్తుంది
కలం లేక కాలాన్ని వృధా చేసిన వారు ఎన్నో కార్యాలను మరచిపోయిన వారు ఎందరో
ఓ గొప్ప ఆలోచనను గాని ఉపాయాన్ని గాని మరచిపోతే జీవితాలు కూడా మారలేవు
ఏదైనా వ్రాసుకుంటే కదా గుర్తు ఉంటుంది ముఖ్యమైన వస్తువును మరచిపోలేం
ప్రాణాలను కాపాడుకోవటానికి కూడా కొన్ని సార్లు కలం ముఖ్య అవసరం కావచ్చు
పది రకాల వస్తువులను తీసుకు రావాలంటే వ్రాసుకోవాలి లేదంటే మరచిపోతాం
మరచిపోవుట వల్ల కాలం వృధా ప్రయాణ ఖర్చు ఉంటే ఆర్థిక నష్టం అలసట ఎన్నో
కొన్ని గొప్ప కార్యాలకు పనులకు కలం చాలా అవసరమని నా అభిప్రాయం
కలంతో ఎన్నో సరి చేసుకోవచ్చు అవసరమైతే జీవితాన్ని మార్చుకోవచ్చు
ఇంకా ఎన్నో తెలుపగలను మీరు మీ మేధస్సుతో కలం ఉపయోగాన్ని గ్రహించండి
No comments:
Post a Comment