Sunday, January 23, 2011

ఒక భావనతో ఓ వ్యక్తిని ద్వేషించడం

ఒక భావనతో ఓ వ్యక్తిని ద్వేషించడం మరల మరో భావనతో అతనిని ప్రేమించడం
కొన్ని క్షణాలలో మారే భావాలకు మన విచక్షణ కాల ప్రభావాలకు మారుతుంటుంది
మనలో ఉండే ఆవేదనలే వివిధ కార్యాలలో వివిధ రకాలుగా విచక్షణ మారుతుంది
సమన్వయ భావాలు ఎక్కువగా లేక ఆలోచనల అర్థాలను త్వరగా గ్రహించలేకనే ఇలా
ఎందరినో ద్వేషిస్తాం మరెందరినో ప్రేమిస్తాం ఎందరితోనో స్నేహ శత్రు భావాలను సాగిస్తాం
అందరితో స్నేహ భావాలతో వివిధ విజ్ఞాన కార్యాలతో సమన్వయ సహాయాలతో సాగుదాం
ప్రతి ఆలోచనను గ్రహిస్తున్నప్పుడే మనలో మహా విశిష్ట గుణ విచక్షణ భావాలు ఉద్భవిస్తాయి

No comments:

Post a Comment