నిదానమే ప్రధానమైనప్పుడు ఆలస్యం అమృతం విషం కాదు
మన భావాలే విషమవుతాయి గాని అమృతం విషం కాదు
ఏ నష్టం జరిగినా క్షణాలలో ఎవరు గెలిచినా వాహానాలు వెళ్ళిపోయినా
ఆహారం చల్లారినా మన భావాలు ఓడి పోయాయని మనం అనుకుంటాం
కాలానికి ఎలా ఇష్టమైతే అలా మనం సాగిపోతాం ఇది కాల క్షేమ ప్రభావాలే
మనం విజ్ఞానంగా జాగ్రత్తగా సాగుతున్నంతవరకు ప్రతి కార్యం మంచి కోసమే
మనం చేసే పనిని గౌరవించుకుంటే అన్నీ సకాలంలో విశ్వ కాలంతో సాగిపోతాయి
అమృతం విషమైనట్లు జన్మ మరణమేనని యదార్థ భావన నిదానంగా తెలిసినా ప్రధానమైనదే
No comments:
Post a Comment