Sunday, January 23, 2011

నీ గురించి నీవు చెప్పడం కాదు

నీ గురించి నీవు చెప్పడం కాదు నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఒకేలా చెప్పగలగాలి
నా గురించి నేను చెప్పడం కాదు నా గురించి సంపూర్ణంగా తెలిసినవారే చెప్పాలి
నా భావాలను గ్రహించిన వారు నా తత్వాలను తెలిసిన వారు ఒకేలా చెప్పగలగాలి
ఎవరు ఎలా చెప్పినా నా గురించి నా విశ్వ తత్వ భావాలు నాకు తెలుసు
మీ విశ్వ విజ్ఞాన భావాలు మీకు తెలుసు అందరికి అన్నీ తెలియకపోవచ్చు
తప్పులను గుర్తించడం కాదు విశ్వ గుణ తత్వాన్ని గురించి ఉపయోగాన్ని తెలుపడం
ఒకరి గురించి చెప్పడమే కాదు తెలియని మహా విషయాలను తెలుసుకోగలగాలి
అన్నీ విశ్వ విజ్ఞానంగా ఎదగడానికే అందరికి సంపూర్ణ విజ్ఞానం కలగడానికే
ఏది ఎప్పుడు ఎవరికి ఎలా చెప్పాలో తెలుసుకోవటమే గుణ విజ్ఞాన విచక్షణ ప్రవర్తన

No comments:

Post a Comment