Wednesday, January 26, 2011

మనస్సులో మరుపు ఉన్నట్లు

మనస్సులో మరుపు ఉన్నట్లు ఆలోచనలలో విజ్ఞానం ఉండదు
ఆలోచనలలో ఎరుక ఉండి ఆశాస్పదం లేనప్పుడు విజ్ఞానం ఉంటుంది
మేధస్సులో ఎన్నో ఆలోచనలు ఎన్నో భావార్థాలతో కలుగుతుంటాయి
ఏ ఆలోచన ఏ విజ్ఞాన అర్థాన్ని తెలుపుతుందో ఏ అజ్ఞానాన్ని కలిగిస్తుందో
ఆలోచనలు ఎక్కువైనప్పుడు ఏకాగ్రత లేనప్పుడు ఎరుక లేక పోతుంది
అలాగే ఆలోచనలలో విజ్ఞానం మరుపుగా మనస్సు ఆశతో అన్వేషిస్తుంది
ఆశతో కార్యాలను సాగిస్తూ పొతే అష్ట కష్టాల నష్టాలే ఎదురవుతాయి
మనస్సును ఎప్పుడు విజ్ఞాన మేధస్సుతో ఆలోచనల ఎరుకతో కేంద్రీకరించాలి

No comments:

Post a Comment