అనాధగా జీవిస్తుంటే ఆకాశమే నీకు నేస్తం
సూర్య చంద్రులే నీకు తల్లి తండ్రుల బంధం
విశ్వమే గృహముగా నీ ఆలోచనే ప్రపంచం
నీకెందరో ఉన్నా ప్రస్తుతం నీ యందు లేరు
ఎవరు లేకపోతే నీ ఆలోచనలలో విచారం
విచారించకుండా భావాలతో విశ్వాన్ని గమనించు
జీవితం విశ్వ విజ్ఞాన భావాలోచనలతో సాగుతుంది
స్నేహితుడు నీకు తోడుగా ఉంటే ఎన్ని యుగాలైనా జీవించవచ్చు
నక్షత్రాలు కూడా నీకు గురువులుగా ఎప్పుడూ భోదిస్తూ ఉంటారు
No comments:
Post a Comment