సమాజంలో కొన్ని సంవత్సరాలు జీవిస్తేనే సమాజ విజ్ఞానం తెలుస్తుంది
సమాజాన్ని గమనిస్తే ఏది ఎలా ఎందుకు ఎప్పడు ఏమవుతుందో తెలియును
గమనించుటలో వివిధ ప్రణాళికలలో లోటుపాట్లు ఏవో తెలుస్తూ వస్తాయి
ఎవరు గొప్ప వ్యక్తులు ఎవరు ఎలాంటి వారు ఎవరు సమాజాన్ని మార్చగలరు
ప్రశాంతమైన జీవితాన్ని ఎవరు అందించగలరు ఎవరికి దయా గుణాలు కలవు
కనీస సౌకర్యాలను నిత్య అవసరాలను ఎవరు సకాలంలో తీర్చగలరు
కొన్ని దశాబ్దాలు జీవిస్తేనే సమాజ స్థితి పరిస్థితి మనకు తెలుస్తూ అర్థమవుతుంది
మన నడవడి ప్రవర్తన గుణ భాష భావాలు సమాజ స్పృహ ఉంటే దేశమే సౌభాగ్యం
వీటన్నింటికి మంచి ప్రణాళిక ప్రభుతమే చేపట్టాలి అందుకు మన సహకారం అందించాలి
సమాజం కోసం నాలో ఓ గొప్ప ప్రణాళిక ఉన్నది తెలుసుకోవాలన్న వారికి తెలుపగలను
No comments:
Post a Comment