నీవు ఎవరు? - ఎలా తెలిపితే విశ్వార్థం కలుగును
నీవు ఎవరని నీకు నీ భాషలో నీకు తెలిసేలా తెలపాలనే నా భావన
జీవిగా ఉదయించే ప్రతి జీవి ఒక జీవి నుండి జన్మించుటయే కదా
ఒక జీవిగా జన్మించుటలో ఆత్మగా నేను ఒక విశ్వ శక్తిని
నా ఆత్మకు ఓ గుర్తింపుగా నాకు ఓ రూపం కావాలని నాకొక జన్మ
నా ఆత్మ భావాలకు తగిన శరీర రూప జన్మయే వివిధ జీవులలో ఒక జీవిగా
ఒక జీవిగా నేను ఏ రూపంలోనైనా ఏ విధమైన జీవిలోనైనా ఆత్మగా ప్రవేశిస్తాను
ఆత్మగా నేను ఒక మానవ జన్మగా జన్మించినప్పుడే నాకు ఓ విజ్ఞాన గుర్తింపు వస్తుంది
ఆత్మలో ఎన్ని జన్మల జీవ భావాలున్నా మానవ జన్మయే నీవు ఎవరని తెలుపుతుంది
మానవ విజ్ఞానమున ప్రతి ఒకరికి ఓ నామము గుర్తింపుగా ఉంటుంది
నీవు ఎవరంటే పలాన తల్లి తండ్రుల కుమారుడని తెలుపవచ్చు
నీ నామమును ఓ గుర్తింపుగా తెలుపుకొని పరిచయం చేసుకోవచ్చు
'ఎన్ని ఎలా చెప్పుకున్నా నీ నామమే నీకు గుర్తింపు నిస్తుంది'
నేను సమాజంలో జీవించే ఒక మానవుడిని
నన్ను సమాజంలో గుర్తించడానికి నాకు ఒక నామము కలదు
నేను ఎవరని ఇంకా వివరణగా తెలియాలంటే నా తల్లి తండ్రుల నామములు అవసరం
నేను పలాన కళాశాలలో చదువుతున్న విద్యార్థిని
నేను పలాన పరిశ్రమలో పనిచేస్తున్న వాడిని
నేను సమాజంలో ఓ విజ్ఞానిగా ఎదుగుతున్న వ్యక్తిని
No comments:
Post a Comment