రేపటి విశ్వ కార్యాలకు ప్రణాళికలను ఎవరు ఏర్పాటు చేస్తున్నారు
మేల్కొన్నప్పటి నుండి నిద్రపోయే వరకు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి
ప్రతి జీవికి ఎన్నో కార్యాలను ఎవరు ఎలా ఎందుకు కల్పిస్తున్నారు
విశ్వమున జరిగే కార్యాలకు ప్రణాళికలు మన ఆలోచనలలోనే ఉన్నాయా
ప్రతి రోజు ఏదో ఆర్థికంగా ఎదగాలనే ఆశ తప్ప మహా విజ్ఞానమనే ఆలోచన లేదే
సమాజం ఆర్థికంగా మార్గాన్ని చూపిస్తూ కార్యాలను తెలుపుతూ వెళ్ళిపోతుంది
మేధస్సులోని కార్య ప్రణాళికలకు ఎవరు భాధ్యులో సమాజమే నిర్ణయించునా
ఆహారం ఆర్థికం విజ్ఞానం ఈ మూడే ప్రధాన అంశాలుగా సాగిపోతున్నాయి
ఈ విశాలమైన విశ్వంలో ఇంకా గొప్పగా ఏమి చేయాలో తెలుసుకోండి
విశ్వ విజ్ఞానం ఏమైనా తెలుసుకొనుటకు వీలవుతుందో లేదో ఆలోచించండి
No comments:
Post a Comment