నిద్రలో ఏమి జరుగుతుందో మేధస్సులో ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది
గత భవిష్య కార్యాలు ఊహా సంబంధమైనవి ఆలోచనలుగా సాగుతున్నాయి
సంపూర్ణంగా ఇంకా ఏమి జరుగుతుందో ప్రశ్నార్థకంగానే మిగిలింది
మేధస్సుకు కాస్త విశ్రాంతిని ఇచ్చినా పగలు శరీరానికి కాస్త శక్తి వస్తుంది
కొన్నింటిని మరచిపోతాం కొత్త వాటిని తెలుసుకుంటాం కార్యాలతో సాగిపోతాం
ఏదో ఒక దానిని ఆలోచిస్తాం కొత్తగా తెలిసే వాటిపై ఆశాభిప్రాయంతో వెళ్ళిపోతాం
మనస్సు ఎలా నిద్రపోతుందో ఎలా మేల్కొంటుందో అంతా విచక్షణ భావమే
నిద్రించుట ఓ అంతర్ముఖ విశ్వ కార్య గుణ భావ పంచ భూతాత్మ విధానమే
No comments:
Post a Comment