ఈ రోగానికి ఏం రోగమో మాయ రోగం వచ్చినట్లుంది
పెరగటమే గాని తగ్గటం లేదు ఎంతటి కర్మ రోగమో
వేధిస్తూనే వేలలో ఖర్చై ఎక్కడ తిరిగినా మహా రోగమే
మహమ్మారి లా అమ్మోరు తల్లిని వేడుకున్నా వీడని రోగం
రోగాన్ని చూస్తేనే మూర్చ పోయేటట్లు ముప్పై తరాలుగా వస్తున్నది
కొన్ని రోగాలు చాలా భయంకరంగా వంశ పారంపరంగా వస్తుంటాయి
వీలైనంత త్వరగా వదిలించుకుంటే సరి లేవంటే వదిలించుకోవాలన్నా వదలవు
గ్రహచారం ఉన్నప్పుడు ఏ శాస్త్రీయం ఏ రోగాన్ని వదిలించదు
No comments:
Post a Comment