నక్షత్రమా! ప్రతి రోజు చంద్రునితో దివ్య దర్శనమా
ప్రతి రోజు కాస్త దూరంగా మళ్ళీ కొన్ని రోజులకు కాస్త దగ్గరగా వస్తున్నావు
ఇలా ఎన్నో నక్షత్రాలు కొన్ని వ్యత్యాస దూరాలతో కాస్త సమయ తేడాలతో
ప్రతి రోజు ఆకాశ విశ్వమున దివ్య ప్రకాశ కాంతి తేజస్సులతో దర్శన మిస్తున్నాయి
నక్షత్రాల ఆకాశ భూగోళ భ్రమణ గమనానికి నా ఆత్మ భావ స్వభావాలే కేంద్ర కక్ష్యాలు
నా స్థితి ఎలా ఉంటే అలా ప్రతి విశ్వ రూపాలు భ్రమణం చెందుతూ విశ్వ కాలాన్ని సాగిస్తాయి
నా మేధస్సుకు విశ్వ దర్శనమే జీవిత భావ స్వభావాల దివ్య తత్వ ఆత్మ శక్తి పోషకాలు
No comments:
Post a Comment