కాలమే నన్ను మోసగిస్తూ ప్రతి క్షణం వేధిస్తూనే ఉంటుంది
ఎంత విజ్ఞానంగా ఆలోచించినా మరుపు కలుగుతూ ఉంటుంది
ఎన్నో విధాల ఏ ఉపాయాన్ని ప్రయోగించినా నాకు మహా నష్టమే
నష్టాలతో కష్టాలను పెను వేసుకున్నా నా భుజాలు కూడా ఓరలేవు
లాభాలను ఆలోచించుట నాకు సరిపోని బంధమేనని నా మేధస్సులో
ఏ ఆశయం లేకుండా జీవించాలనే నా ఆత్మ స్థితి భావన స్వభావ తత్వం
ఏ కాలం నాకు వద్దు ఏ రాజ్యం నాకు వద్దు ఏదైనా నన్ను ముంచేస్తుంది
కాలమే నాకు శత్రువై నన్ను వెంటాడుతూ కష్ట నష్టాలకు దగ్గర చేస్తుంది
నన్ను నేను మరచిపోయేలా కాలానికి కూడా తెలియకుండా జీవించాలనే
No comments:
Post a Comment