నేత్రం లేని వారిలో సూర్య భావాలు కలగాలనే నిత్యం ధ్యానిస్తున్నా
సూర్య తేజస్సు స్వభావాలతోనే లోక విచక్షణ కలగాలని ధ్యానిస్తున్నా
ప్రతి ఆలోచన ఓ కిరణంలో ఓ భావ స్పర్శ విజ్ఞానంలా గుర్తుండాలి
ప్రతి భావనకు నేత్ర విజ్ఞానం ఆత్మ జ్ఞానంగా విశ్వ విచక్షణ కావాలి
ప్రతి స్పందన మేధస్సుకు చేరి విశ్వ రూపాల భావాన్ని గ్రహించాలి
జ్ఞానేంద్రియాలు విశ్వ కేంద్రాలుగా విశ్వ ప్రకంపనాల తరంగాలను గమనించ గలగాలి
ఊహా భావాలలో నేత్ర విచక్షణ విశ్వ రూప సూర్య తేజమే నని నా నేత్ర తత్వం
No comments:
Post a Comment