Sunday, January 23, 2011

కాల వేగాన్ని నీవు అధిగమించలేవు

కాల వేగాన్ని నీవు అధిగమించలేవు కాల ప్రభావాన్ని తప్పించుకోలేవు
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎన్నో విధాల క్షణాలలో మరుపు కలుగుతుంది
మరుపుతో ఎన్నో నష్టాలు అవస్థలు భాదలు దుఃఖాలు ఎదురవుతాయి
అజ్ఞానాన్ని కూడా గ్రహించలేనంతగా అలాగే సాగిపోతూ జీవుస్తుంటావు
వాహానాన్ని ఎంత వేగంగా నడుపుతున్నా ప్రమాదాన్ని తప్పించుకోలేవు
ప్రమాదాన్ని తప్పించుకోలేనంతగా వాహనాన్ని వేగంగా నడుపుతున్నావు
నీ ఆలోచనలలో సాగిన వేగం కాల వేగాన్ని తప్పించుకోలేక ప్రమాదాలెన్నో
కాల వేగంలో నీవు నీ వేగాన్ని నా భావాల ఆవేదనను తగ్గించుకోలేవు
వాహనాన్ని అదుపు చేయలేని వేగం మనకు మన విచక్షణకు సరికాదు
విజ్ఞాన వేగంతో మన మేధస్సును నిర్దిష్ట భావాలతో సాగిస్తూ ప్రయాణించాలి
కాలం ఎప్పుడు అజ్ఞానంగా మన విజ్ఞానంతో పోరాడుతూ ఉంటుంది

No comments:

Post a Comment