ఇక్కడే బంధాలను వేసుకొని జీవిస్తే మరో లోకానికి ఎప్పుడు వెళ్ళిపోతావు
మరో లోకానికి వెళ్లిపోవాలనే ఆలోచన కలగలేదా ఉందో లేదో తెలియదా
సమాజ విజ్ఞానంతోనే జీవిస్తూ జీవితమే ఇలా అందరిలా ఆర్ధిక క్షేమాలే
సమాజంలోనే జీవిస్తూ ఆలోచనలను మాత్రమే విశ్వంలో అన్వేషించు
విశ్వ విజ్ఞానం నీ మేధస్సులో భావాలుగా చేరుతూ కాలజ్ఞానమగునేమో
విశ్వ విజ్ఞానంతో ఆత్మను విశ్వ చైతన్యం చేసి మరో లోకాలకు ప్రవేశిస్తావు
మరో లోకంలో ఎంతటి విజ్ఞానమున్నదో మేధస్సుకే మహా అద్భుతమా
జగతిలో ఉన్న లోకాలను చుట్టి విశ్వాంతర విజ్ఞానిగా జీవిస్తూ ప్రయాణించు
No comments:
Post a Comment