ఆకాశం ఆరు భాగాలుగా ఆరు రంగులతో విడిపోయినట్లు కనిపిస్తున్నది
పరమార వైపు క్రింద భాగం నల్లని రంగు దానిపై ఊదా రంగు కనిపిస్తూ
ఆపైన సూర్య కిరణాలతో పసుపు రంగు ఆ తర్వాత మేఘాలలో ఎరుపు
ఆపైన మేఘాలతో తెలుపు రంగు ఆ తర్వాత తూర్పు వైపున నీలాకాశం
అక్కడక్కడ మసక మసక రంగులతో ఉత్తర దక్షిణ భాగాలు ఉన్నాయి
ఆకాశంలో ఎప్పుడు ఎక్కడ ఏ అద్భుత వర్ణ చిత్రాలు కనిపిస్తాయో క్షణాలకే లెక్క
ఆకాశంలో ప్రతి వర్ణ భావన కనిపిస్తుందని నా నేత్ర ఆకాశ చిత్రాలే నిదర్శనం
నాలో దాగిన సూర్యోదయ సూర్యాస్తమయ కిరణ మేఘ వర్ణాలు మహా అద్భుతమే
No comments:
Post a Comment