ప్రపంచాన్ని ఓ పద్ధతిగా మార్చాలన్న భావన నాలో కలుగుతూనే ఉన్నది
నాలో ఉన్న ప్రణాళికలు ఓ కార్య క్రమ కారణ పద్ధతిలో ఉన్నాయనే నాకు
ఖర్చు ఎంతైనా ఎన్నో యుగాలకు సరైన నిర్దిష్ట ప్రణాళిక ఉంటుందనే నేను
అందరు సుఖంగా జీవిస్తూ విజ్ఞాన భావాలతో శ్రమిస్తూ ఉంటారు
నా ప్రణాళికలో కొంత కాలం తర్వాత ధనం చలామణిలో ఉండదు
ధనం ప్రభుతానికే సంబంధితమై విదేశాల రాకపోకలకు ఎగుమతి దిగుమతులకే
నా ప్రణాళిక ఎవరికైనా వివరణగా కావాలంటే వివరించగలను
సమాజాన్ని మార్చాలన్నా దేశాన్ని ప్రగతి వైపు తీసుకురావాలన్నా ఇదే సరి
ప్రపంచంలో మన దేశమే మొదటి విజ్ఞాన జీవిత ప్రణాళికగా సాగాలని నా భావన
నా ప్రణాళిక సరైనదైతే ప్రపంచమంతా ఇలాగే కావాలని ఇలాగే ఉండాలని
ఇదే సరైన జీవిత విధానమని దీనినే కోరుకుంటారు ఆశ్రయిస్తారు సాధిస్తారు
ఆలస్యమయ్యే కొద్ది మార్పు రావడం ఇంకా ఆలస్యం కష్టంగా మారుతుంది
మనిషిలో మార్పు కలిగి సత్ ప్రవర్తన కలగడానికి ఇదే చాల అవకాశం
No comments:
Post a Comment