ఇప్పటికి ప్రతి రోజు మానవులనే పలకరిస్తున్నావు
ఇతర జీవులను పలకరించే సమయం లేకున్నది
చిన్నప్పుడు కొన్ని జీవులతో ఆడుకున్నావు
ప్రస్తుతం సమస్యలతో వివిధ కార్యాలతో జీవిస్తున్నావు
ఇతర జీవులకు ఉల్లాసం సంతోషం తగ్గిపోయాయి
మానవుల స్నేహ బంధాలు చాలా వరకు తరిగాయి
జంతువులతో పక్షులతో జీవించే విధానం తగ్గిపోయింది
ఇతర జీవులకు కాస్త ఆహారాన్నైనా అందించండి
ఆనాడు నీతో జీవించిన జీవులు నేడు ఎక్కడో
ఎన్నో ఆనాటి నీ స్నేహ జీవులు మరణించాయి
జ్ఞాపకాల జీవితం కూడా మానవ మేధస్సుకు లేదే
No comments:
Post a Comment