స్థితి అంటే పరిస్థితి కాదు
పరిస్థితిలో ఉన్న గుణ స్థితిని గ్రహించాలి
నేడు విశ్వ స్థితి మేఘ మలినముల ప్రభావాన్ని కలిగి ఉన్నది
మేఘ మలినముల ద్వారా విశ్వమున సామర్థ్యం తగ్గిపోతున్నది
కాల ప్రభావాలు మారుతూ ఎన్నో విధాల ఋతు పవనాలు మారుతున్నాయి
ఆహార శక్తి జీవుల జీవిత కాలాలు తగ్గిపోతూ విశ్వ జీవుల స్థితి మారుతున్నది
మన ఆత్మ స్థితి కూడా విజ్ఞానంగా లేక శరీర స్థితులు మారుతూ ఉన్నాయి
ప్రతి అణువు యొక్క స్థితి తెలుసుకుంటే ప్రతి దానిని విజ్ఞానంగా గ్రహించవచ్చు
దేనిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో మేధస్సుకు క్షుణ్ణంగా తెలుస్తుంది
వాతావరణాన్ని పరి రక్షిస్తూ మానవ గుణాలతో సమాజాన్ని సరిచేసుకోవాలి
No comments:
Post a Comment