Monday, November 7, 2016

ఎవరో నీవు ఎవరో అనుకున్నా మనమంతా జనతా ఈ జగమంతా

ఎవరో నీవు ఎవరో అనుకున్నా మనమంతా జనతా ఈ జగమంతా
ఎవరో మనమెవరో అనుకున్నా మనమంతా జనతా ఈ జగమంతా  || ఎవరో ||

నీవే ఓ ప్రణామం తెలుపవా ప్రకృతిలో జీవిస్తున్నందుకు
నీవే ప్రభోదం గ్రహించవా జగతిలో విజ్ఞానాన్ని పొందుటకు
నీవే ప్రమాణం చేసుకోవా మన సృష్టిని మనమే రక్షించుటకు
నీవే సమస్తం తెలుసుకోవా ఎప్పటికైనా సమాప్తం అయ్యేందుకు
నీవే పరిశోధనం చేయవా విశ్వంలో ఉన్న ప్రజ్ఞానాన్ని పంచేందుకు

నీవు నేను మనమే జగతికి ప్రసిద్ధం ప్రపూర్ణం ప్రయోజనం          || ఎవరో ||

నీవే ప్రయాణం చేస్తూనే కాలంతో జరిగే ప్రమేయం ఎందుకో తెలుసుకోవాలి
నీవే ప్రణామం స్వీకరిస్తూనే జరుగుతున్న ప్రయోగం ఎందుకో తెలుపుకోవాలి
నీవే ప్రపంచం వీక్షిస్తూనే జరగబోయే పరిశోధనం ఎందుకో తెలియజేయాలి
నీవే సంకల్పం వహిస్తూనే జరగాలన్న మహా సంభోగం ఎందుకో తెలుపుకోవాలి
నీవే ప్రభావం చూపిస్తూనే జరిగిన కాలంతో ప్రశాంతం ఎందుకో తపించిపోవాలి

నీవు నేను మనమే జగతికి పరిశుద్ధం పరిపూర్ణం పరిమళం          || ఎవరో ||  

No comments:

Post a Comment