Tuesday, November 22, 2016

భవిష్యవాణి తెలిపిందా వేద విజ్ఞానం ఒక బహుమతిగా నాకు కలిగిందని

భవిష్యవాణి తెలిపిందా వేద విజ్ఞానం ఒక బహుమతిగా నాకు కలిగిందని
విశ్వవాణి కరుణించిందా వేదాంతం ఒక పురస్కారమై నన్ను వరించిందని
ఆకాశవాణి తలచిందా పాండిత్యం ఒక మహా సత్కారమై నన్ను ధరించిందని  || భవిష్యవాణి ||

పద భూషణతో కలిగే బహుమతులు ఏవైనా నాకు బహు ప్రాణమే
పద జాలంతో పొందే పురస్కారాలు ఏవైనా నాకు బహు చిత్రమే
పద సంభాషణతో వచ్చే వేతనాలు ఏవైనా నాకు బహు గాత్రమే
పద పాండిత్యంతో ఇచ్చే వందనాలు ఏవైనా నాకు బహు ధర్మమే

విజ్ఞానమునకై శ్రమించుటలో ప్రతిఫలం ఏదైనా నాకు పారితోషికమే
వేదాంతముకై అన్వేషించుటలో ఏ తీర్పు ఇచ్చినా నాకు నిశ్చయమే  || భవిష్యవాణి ||

ఏ బహుమానం లేకున్నా నాలోని ధీరమతియే ఒక శక్తిత్వం
ఏ సత్కారం లేకున్నా నాలోని సమన్వయమే ఒక సత్యత్వం
ఏ పురస్కారం లేకున్నా నాలోని ప్రదానమే ఒక దివ్యత్వం
ఏ విరాళం లేకున్నా నాలోని మహా గళమే ఒక యుక్తిత్వం

నాలోని ఏ ప్రధాన అంశాన్ని గ్రహించినా ఒక భావత్వమే
నాలోని ఓ ప్రత్యేకతను గుర్తించినా ఒక విజ్ఞాన విద్యత్వమే  || భవిష్యవాణి || 

No comments:

Post a Comment