Friday, November 11, 2016

క్షణం ఈ క్షణం ప్రతి క్షణం మరో క్షణానికి లేదులే

క్షణం ఈ క్షణం ప్రతి క్షణం మరో క్షణానికి లేదులే
సమయం ఈ సమయం మరో సమయానికి ఉండదులే  || క్షణం ||

ఏ క్షణమైనా ఆ క్షణ కాలానికే అప్పుడే సొంతం
ఏ సమయమైనా ఆ సమయ స్పూర్తికే మూలం

ఏ క్షణం నీ క్షణం ప్రతి క్షణం నిరీక్షణం
ఏ సమయం నీ సమయం సమన్వయం

ప్రతి క్షణం కాలంతో సాగే ఒక తరుణం
ప్రతి సమయం కాలంతో కలిసే చరితం  || క్షణం ||

క్షణం ప్రతి క్షణం ఒక కాల మాన గమనం
సమయం ప్రతి సమయం కాల ప్రయాణం

ఏ క్షణమైనా విశ్వానికి ఆ క్షణమే ఒక క్షణ సమయం
ఏ సమయమైనా జగతికి ఆ క్షణాల కలయికయే కాలం

క్షణం క్షణంలోనే సమయమై కాలంతో సమయమైన ఒక క్షణం
సమయం క్షణంతోనే సమయమై కాలంతో క్షణాలైన సమయం  || క్షణం || 

No comments:

Post a Comment