Thursday, November 10, 2016

నాట్యం భరత నాట్యం ఆంధ్రుల నటరాజుని కళా నాట్యం

నాట్యం భరత నాట్యం ఆంధ్రుల నటరాజుని కళా నాట్యం
గీతం సంగీతం సరిగమల శుభ గాన స్వర జీవ కళా నాట్యం

వేదం మన వేదం ఆంధ్రుల వేదాంత విజ్ఞాన పాండిత్యం
భావం మన భావం మాతృత్వ మహాత్ముల విశ్వ భావత్వం  || నాట్యం ||

స్వర గాన సంగీత సరిగమల పరిచయమే పదనిసల పరిమళం
నవ గాన నటరాజ భావాలే నాట్య కళా చాతుర్య భరత చరితం

భారతీయుల భారత నాట్యం జగతికి జీవ పోషణ కళా భావం
వేద భావ రూప తత్వం నాట్య కళా భారత సంస్కృతి ప్రదం  || నాట్యం ||

విశ్వ భావాల గీతామృతం స్వర గాన సంగీత స్వరాభిషేకం
నవ భావాల నాట్యామృతం నటరాజుని శృంగార నైవేద్యం

ఆత్మ కళా జ్యోతి రూపం పరమాత్మ తత్వ నాట్య శిఖరం
మాతృ కళా భరితం నాట్య సాగర సంగీత స్వర ఖండం  || నాట్యం || 

No comments:

Post a Comment