Thursday, November 17, 2016

నీవేనా నేనేనా నీలో ఉన్నది నేనేనా నాలో ఉన్నది నీవేనా

నీవేనా నేనేనా నీలో ఉన్నది నేనేనా నాలో ఉన్నది నీవేనా
నీలో నేనై నాలో నీవై ఉంటేనే ఇద్దరం ఒకటేనా ఈ జగానా   || నీవేనా ||

నీవు నేను ఒకటై జగానికే యుగమై తరతరాల తరుణమై సాగేమా
నీవు నేను వేదమై లోకానికే విశ్వమై తరతరాల క్షణమై సాగేదమా

నీలో నేనేనా నాలో నీవేనా నీలో నాలో ఒకటే భావమై ప్రయాణం చేసెదమా
నీతో నేనేనా నాతో నీవేనా నీవు నేను ఒకటిగా సగమై కలిసే ప్రయాణించెదమా  || నీవేనా ||

నీకు నేనై ఉన్నా నాకు నీవై ఉన్నా నీవు నేను కలిసే ఉన్నావని ఎవరికైనా తెలిపామా
నీకు నేనే నాకు నీవే ఉన్నావని నిత్యం నివసించేలా మనలో మనమే కలిసిపోయామా

నీతో ఉన్న క్షణమే నాతో ఉన్న క్షణమే సమయమై కాలంతో ప్రయాణం చేసేమా
నీలో ఉన్న గమనమే నాలో ఉన్న గమకమే క్షణమై ప్రతి క్షణం కాలంతో సాగేమా  || నీవేనా || 

No comments:

Post a Comment