విశ్వానికి నేను ఒక రూపం
నా రూపానికి ఏదో ఒక భావం
నా భావాలకు ఒక తత్త్వం
ఆ తత్త్వాలకు ఒక స్థైర్యం
నా స్థైర్యానికి ఒక లక్ష్యం
ఆ లక్ష్యానికి ఒక మోక్షం
నా మోక్షానికి ఒక మార్గం
ఆ మార్గానికి ఒక వేదం
నా వేదానికి ఒక జ్ఞానం
ఆ జ్ఞానానికి ఒక అర్థం
నా అర్థానికి ఒక హితం
ఆ హితానికి ఒక అంశం
నా అర్థానికి ఒక పరమార్థం
ఆ అంశానికి ఒక పరమాత్మం || విశ్వానికి ||
ప్రతి రూపానికి ఏదో ఒక భావం
భావంతో ఎదిగే విజ్ఞానమే ఒక కార్యం
కార్యాలే జీవితానికి ఎదో ఒక మార్గం
మార్గంతో సాగే విజయమే ఒక లక్ష్యం
లక్ష్యాలే బంధానికి ఎదో ఒక స్థైర్యం
స్థైర్యంతో కలిగే సహనమే ఒక ధైర్యం
ధైర్యాలే సత్యానికి ఏదో ఒక ధర్మం
ధర్మంతో ఒదిగే వినయమే ఒక తత్త్వం || విశ్వానికి ||
ప్రతి జీవికి ఏదో ఒక ఉత్తేజం
ఉత్తేజంతో ఎదిగే సుగుణమే ఒక సూత్రం
సూత్రాలే జీవనానికి ఏదో ఒక ఆచరణం
ఆచరణతో సాగే పరిశోధనమే ఒక శాస్త్రం
శాస్త్రాలే జీవులకు ఏదో ఒక చరణం
చరణంతో కలిగే సంతోషమే ఒక నిలయం
నిలయాలే జీవితానికి ఏదో ఒక సంస్కారం
సంస్కారంతో ఒదిగే విషయమే ఒక సంపూర్ణం || విశ్వానికి ||
No comments:
Post a Comment