ఫలితమే లేని విజయాన్ని ఎవరైనా గుర్తించారా
చరితమే లేని భరితాన్ని ఎప్పుడైనా చర్చించారా
ఆచరణ లేని ఆశ్రయాన్ని ఎలాగైనా మళ్ళించారా
ఆలాపన లేని ఆనందాన్ని ఎక్కడైనా సాధించారా
ఆనందమే లేని జీవితాన్ని ఎవరైనా ప్రోత్సహించారా
ఆశయమే లేని సహనాన్ని ఎప్పుడైనా ప్రదర్శించారా
రక్షణయే లేని సమయాన్ని ఎవరితోనైనా విచారించారా
లక్షణమే లేని సహాయాన్ని ఎవరితోనైనా నిర్బంధించారా
No comments:
Post a Comment