విశ్వమా నీవు ఆగలేవా
ఆగవని తెలిసినా నేను ఆగిపోతున్నా
కాలమా నీవు ఆగలేవా
ఆగవని తెలిసినా నేను ఆగిపోతున్నా
వేదమా నీవు ఆగలేవా
ఆగవని తెలిసినా నేను ఆగిపోతున్నా
సహనమే నీవని తెలిసినా సాధనయే నీతో సాగిపోవునా
సమయమే నీవని తెలిసినా సమస్తమే నీతో సాగిపోవునా
ఆశయంతో సాగే జీవుల విజ్ఞానం ఆశించలేని నీ సహనానికి స్వభావమే సమర్థమైనదా || విశ్వమా ||
సాగుతున్న సాధనకు సమయమే వేదమైతే సహనం సామర్థ్యమై శ్రమించునా
సాగుతున్న వేదనకు వినయమే విశ్వమైతే సమయం సదృశ్యమై సహించునా
ఎదుగుతున్న కాలానికి విజ్ఞానమే విశాలమైతే విజయం విస్తృతమై విరాజితమగునా
ఎదుగుతున్న లోకానికి స్వరాగమే ప్రధానమైతే ప్రదేశం ప్రభాతమై ప్రభావితమగునా
ఆగలేని అనంత భావాలకు స్వభావాలు సుభాషితమై సుమిత్ర కార్యాలతో సాగిపోవునా || విశ్వమా ||
కలుగుతున్న యోచనకు సమయమే సమర్థమైతే సంభవం సుగుణమై సహకరించునా
కలుగుతున్న భావనకు సమీక్షయే సహితమైతే సంపూర్ణం సుధారమై సంభాషించునా
వెలుగుతున్న లక్షణకు సాధనయే సంయుక్తమైతే సందర్భం సంభావనమై విశ్వసించునా
వెలుగుతున్న వీక్షణకు వేదనయే సంకీర్తనమైతే సందర్శనం సంభూతమై విన్నవించునా
ఆగలేని అనంత భావాలకు స్వభావాలు సుభాషితమై సుమిత్ర కార్యాలతో సాగిపోవునా || విశ్వమా ||
No comments:
Post a Comment