Friday, April 1, 2011

నీ మేధస్సు యందే విశ్వ లోకాలు

నీ మేధస్సు యందే విశ్వ లోకాలు ఉన్నాయి
నీ ఆలోచనల ప్రయాణమే నీ విశ్వ దర్శనము
ఆలోచనల అన్వేషణతో విశ్వాన్ని తిలకించవచ్చు
ప్రయాణంతో దూర తీరాలు దగ్గరకు వచ్చేస్తాయి
ఓ సారి విశ్వాన్ని చుట్టేస్తే అనుభవం నీ మేధస్సులోనే
అనుభవమైన ఆలోచనలతో విశ్వ లోకాలు నీ యందే

No comments:

Post a Comment