Saturday, April 2, 2011

మరో ప్రపంచం మేధస్సులోనే ఉన్నదని

మరో ప్రపంచం మేధస్సులోనే ఉన్నదని తెలిసినప్పుడే విశ్వ విజ్ఞానం
మరో జీవి మన ధ్యాసతోనే మన మేధస్సులోనే జీవిస్తున్నాడని తెలుసుకో
నీ ఆలోచనలు ఏ జీవిని తలచినా తన జీవిత స్వభావాలు నీ మేధస్సులోనే
నీవు దేనిని తలచినా దాని భావ స్వభావాలు నీ మేధస్సులోనే జీవిస్తాయి
విశ్వంలో నీవు ఉన్నట్లుగా నీలో విశ్వం ఉన్నదని మరో ప్రపంచపు ఆలోచన
విశ్వాన్ని తలచుటయే విశ్వ విజ్ఞాన లోకంగా నీ మేధస్సులో మరో ప్రపంచం

No comments:

Post a Comment