విశ్వానికి బహు దూరమే ఉన్నా ఆకాశానికి బహు దగ్గరగా ఉన్నట్లున్నది
విశ్వ లోకాలను చూడలేకున్నా ఆకాశం ప్రతి క్షణం కనిపిస్తూనే ఉన్నది
విశ్వ గ్రహాలు ఏ లోకంలో ఎక్కడ ఎలా ఎన్ని ఉన్నాయో తెలియకపోయినా
ఆకాశంలో కనిపించేవన్నింటిని ప్రతి రోజు తిలకిస్తూనే తెలుసుకుంటున్నా
విశ్వ దూరాన్ని నా ఆలోచనల అనుభవంతో మేధస్సుకు దగ్గర చేసుకుంటున్నా
ఆకాశం నా శిరస్సుపై ఉన్నా విశ్వం నా మేధస్సులోనే ఉంటుంది
No comments:
Post a Comment