విశ్వ పరీక్షకు నేను సమ్మతమే దైవమా
విధి వైపరిత్య కాల ప్రభావాలకు అనుచరుడనే
విశ్వ భావ స్వభావాల కాల స్థితికి కృతజ్ఞున్ని
మరో జన్మలో విధి వెంటాడినా నీ ఆధీనంలోనే
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా నా జీవితం ఆవేదనతోనే
మహాత్ముల విజ్ఞాన చరిత్రలు చదివినా అనుకూలత లేదే
విశ్వ విజ్ఞానులు ఎందరో ఉన్నా సమాజంలో సమస్యలే
విశ్వ కార్య ప్రణాళికకు విజ్ఞానం ఉన్నా ఆర్ధిక లోపమే
No comments:
Post a Comment