Sunday, December 23, 2018

సరిగమ స్వరముల పదనిస పదముల

సరిగమ స్వరముల పదనిస పదముల
సరిగమ చదువుల పదనిస పలుకుల

సరిగమ మధువుల పదనిస మనువుల
సరిగమ తలుపుల పదనిస వలపుల

తపనమే గీతం తరుణమే సంగీతం
చలనమే గాత్రం గమనమే సంకేతం

సాధనమే సాహిత్యం సాగరమే సాంగత్యం
సాహసమే సందర్భం సద్భావమే సంపూర్ణం   || సరిగమ ||

అవకాశమే అంకుశం అవధానమే అపురూపం
అనుభవమే ఆదర్శం ఆభరణమే అలంకారం

ఆరోగ్యమే అనుబంధం అనురాగమే అమరత్వం
అధ్యాయమే అనుగ్రం అనూహ్యమే అపరిచిత్వం

ఆకారమే అమృతం ఆద్యంతమే అమోఘం
ఆకర్షణమే ఆకృతం ఆచరణమే ఆస్వాదనం   || సరిగమ ||

సరిగమలే స్వరముల సాహిత్య సంగీతం
పదనిసలే పదముల పలుకుల ప్రశంసం

గమకాల గమనమే గాత్రముల గాంధర్వం
గీతముల గానములే గేయముల గాంగేయం

చిత్రముల వర్ణనలే సంగీత వర్ణాల సోయగం
కళముల కళకళలే మాధుర్య కవితల కమనం  || సరిగమ ||

No comments:

Post a Comment