Wednesday, December 26, 2018

ఏనాటి ధృవ తారవో నీవు ఎంతటి ధృవ తారవో నీవు

ఏనాటి ధృవ తారవో నీవు ఎంతటి ధృవ తారవో నీవు
గగనంలోనే వెలిశావు అంతరిక్షంలోనే ప్రకాశించావు

ఏనాటి నవ తేజానివో నీవు ఎంతటి మహా వర్ణానివో నీవు
గగనంలోనే ఉదయించావు అంతరిక్షంలోనే జన్మించావు

మెరిసే నీ రూపమే మౌనం ఒదిగే నీ వర్ణమే మోహం
విరిసే నీ తేజమే అఖిలం ఎదిగే నీ కాంతమే అమోఘం   || ఏనాటి ||

సూర్య తేజముతో ఎదిగే నీ వైనం ఆకాశంలో నీవే అపురూపం
చంద్ర కాంతముతో ఒదిగే నీ విధం అంతరిక్షంలో నీవే అపూర్వం

విశ్వ తేజస్సుతో వికసించే నీ కిరణం అరుణోదయ ఆనందం
దివ్య రజస్సుతో విహరించే నీ చలనం ఉషోదయ ఉదయం   || ఏనాటి || 

No comments:

Post a Comment