Tuesday, February 27, 2018

మరణానికి మంత్రం ఉన్నదా మార్గం ఉన్నదా

మరణానికి మంత్రం ఉన్నదా మార్గం ఉన్నదా
మరణానికి మనస్సు ఉన్నదా వయస్సు ఉన్నదా

మరణానికి జీవం ఉన్నదా దేహం ఉన్నదా
మరణానికి రూపం ఉన్నదా దైవం ఉన్నదా

మరణమే మర్మమై మేధస్సులో మంత్రమైనదా   || మరణానికి ||

మరణమన్నది జన్మకు అంతమేనని
మరణమన్నది మేధస్సుకు విశ్రాంతేనని

మరణమన్నది దేహాలకు ప్రముఖమని
మరణమన్నది బంధాలకు ఏకాంతామని

మరణమన్నది మనస్సుకు ఆద్యంతమని
మరణమన్నది ఆయుస్సుకు అత్యంతమని   || మరణానికి ||

మరణమే మౌనమై వయస్సుతో ఆగిపోయేనా
మరణమే లీనమై మనస్సుతో నిలిచిపోయేనా

మరణమే నిర్జీవమై దివ్యంగా అదృశ్యమైపోయేనా
మరణమే తటస్థమై నవ్యంగా అంతరించిపోయేనా

మరణమే పరిపూర్ణమై జన్మతో జీవించిపోయేనా
మరణమే పరిశుద్ధమై ఆత్మతో ఆర్జించిపోయేనా   || మరణానికి || 

No comments:

Post a Comment