రారాజుకు రాజును నేనే మహారాజుకు యువరాజును నేనే
సామ్రాజ్యానికి రాజును నేనే సామంతరాజ్యానికి సమరాజును నేనే
ఏ రాజ్యమైనా నా రాజ్యమైనా ప్రతి రాజ్యంలో నేనే బానిసగా శ్రమిస్తూ
పరిరక్షకుడిగా ప్రతి ప్రదేశాన్ని పలు దిక్కులా దిక్సూచిలా పర్యవేక్షిస్తున్నా
ప్రపంచమే నా ప్రాంతం ప్రతి అడుగు నా ప్రదేశం ప్రతి ఒక్కరికి ప్రశాంతం
పరిశుద్ధం చేసే పరిణామం ప్రతి మనిషిలో పరివర్తన చెందే ప్రణాళికతోనే నా ప్రయాణం
ప్రజలతోనే ప్రభంజనం ప్రజలకే ప్రతిఫలం ప్రజలయందే నా జీవితం పరిపూర్ణం
ప్రజలతో సాఫల్యం ప్రజలలో ప్రతి శయనం ప్రజలచే చైతన్యం నా జీవన పరంజం
No comments:
Post a Comment