నీవు ఎక్కడున్నా ఆకాశమై కనిపిస్తున్నావుగా ఓ! పరమాత్మా
నీవు ఎలావున్నా ఆకారమై దర్శనమిస్తున్నావుగా ఓ! పరంధామా
నీవు ఎలాగున్నా జీవమై కనిపిస్తున్నావుగా ఓ! పరంజ్యోతి
నీవు ఏమైవున్నా ఆత్మవై దర్శనమిస్తున్నావుగా ఓ! పరాస్తృతి
నీవు ఏకాంతమై ఉన్నా దివ్యమై కనిపిస్తున్నావుగా ఓ! పురంజన
నీవు ఏకాండమై ఉన్నా సర్వమై దర్శనమిస్తున్నావుగా ఓ! పురుషోత్తమ
నీవు ఎవరివై ఉన్నా ఉజ్వలమై నిపిస్తున్నావుగా ఓ! పురంజయ
నీవు ఏనాదమై ఉన్నా సుజలమై దర్శనమిస్తున్నావుగా ఓ! పురందర
No comments:
Post a Comment