ఏ శ్వాస ధ్యాసలో ఒదిగిపోయావో శివ!
ఏ ధ్యాస దీవిలో ఇమిడిపోయావో శివ!
ఏ ధ్యాన కార్యంలో కలిసిపోయావో శివ!
ఏ దేహ చర్యలో లయమైపోయావో శివ!
ఏ యాస నాదంలో లీనమైపోయావో శివ!
ఏ భాష వేదంలో ఆలింగనమైపోయావో శివ!
నీ జీవమే ఒక మర్మం నీ ఆత్మయే ఒక మంత్రం నీ దేహమే ఒక తంత్రం నీ రూపమే ఒక యంత్రం
నీ గానమే ఒక తీరం నీ గాత్రమే ఒక యాగం నీ గీతమే ఒక బోధం నీ గేయమే ఒక బంధం
No comments:
Post a Comment