శివ! నీ రూపం ఏది నీ రాజ్యం ఏది నీ రాష్ట్రం ఏది
శివ! నీ నామం ఏది నీ నాదం ఏది నీ నాట్యం ఏది
శివ! నీ పాఠం ఏది నీ ప్రాంతం ఏది నీ ప్రాయం ఏది
శివ! నీ సాయం ఏది నీ స్థానం ఏది నీ సౌఖ్యం ఏది
నీవు ఎక్కడున్నా నా ఆఖరి గమ్యం నీయందే శివా!
ఆలోచనతో ! ...
అహోబిలంలో ఉన్నావా అమరావతిలో ఉన్నావా అరుణాచలంలో ఉన్నావా
ఆరోగ్యముతో ! ...
అంబలపూజలో ఉన్నావా అదంబాక్కంలో ఉన్నావా
ఎరుకతో ! ...
ఎత్తుమనూరు లో ఉన్నావా
కలువతో ! ...
కాశీలో ఉన్నావా కాంచీపురంలో ఉన్నావా కుంభకోణంలో ఉన్నావా
తపనతో ! ...
తంజావూరులో ఉన్నావా తిరుచిరపల్లిలో ఉన్నావా తాడిపత్రిలో ఉన్నావా
తపస్సుతో ! ...
తిరుమలలో ఉన్నావా తిరువానంతపురంలో ఉన్నావా తిరువల్లూరులో ఉన్నావా
తన్మయంతో ! ...
తలకాడులో త్రిసూరులో
మర్మంతో ! ...
మధురైలో ఉన్నావా మంత్రాలయంలో ఉన్నావా మహాబలిపురంలో ఉన్నావా
మంత్రంతో ! ...
మహానందిలో ఉన్నావా మైసూరులో ఉన్నావా
యమ్మిగనూరులో ఉన్నావా
రామేశ్వరంలో ఉన్నావా
సోమనాథపురలో ఉన్నావా
శ్రీరంగపట్టణలో ఉన్నావా
హంపిలో ఉన్నావా హాసనలో ఉన్నావా
కనిపించని నీ రూపం దర్శనం కలిగేలా మేధస్సులో ఊహా చిత్ర విశ్వ రూపం అలరారుతున్నది
అరణ్యంలో ఉన్నావో ఆవరణంలో ఉన్నావో ఆవాహనంలో ఉన్నావో
ఆచరణలో ఉన్నావో ఆర్భాటంలో ఉన్నావో ఆశ్రయంలో ఉన్నావో
పర్వతంలో ఉన్నావో ప్రయాణంలో ఉన్నావో ప్రవాహంలో ఉన్నావో
భూగర్భంలో ఉన్నావో భూభ్రమణంలో ఉన్నావో భూప్రకంపనంలో ఉన్నావో
సాగరంలో ఉన్నావో సముద్రంలో ఉన్నావో సురంగంలో ఉన్నావో
నీ రూప విధానం ప్రతి చిత్ర విధానంలో నిక్షిప్తమై నిగూఢమై కలిసిపోయినది శివ!
ఇక నిన్ను గుర్తించే వారు ఎవరో గమనించే వారు ఎవరో గగురించే వారు ఎవరో
నీకు నీవే జీవిస్తూ నిన్ను నీవే దర్శిస్తూ నిన్ను నీవే స్మరిస్తూ కాలాన్ని సాగించుకోవయ్యా శివ!
సృష్టిని శూన్యం చేయకు జగతిని జాగృతిగా చూసుకో విశ్వాన్ని విజ్ఞానంగా చేసుకో పర యోగ శివ!
పరమానంద పరమాత్మ పరశాంత శివ! పరిశుద్ధ పరిశోధన పరిపూర్ణ శివ!
పరంజ్యోతి పరకాంతి పర్యావరణ శివ! పరంజయ పరివర్తన పత్రహరిత శివ!
No comments:
Post a Comment