ఏనాటిదో (నీ) రూపం ఎటువంటిదో (నీ) భావం
ఎక్కడిదో (నీ) నాదం ఎంతటిదో (నీ) తత్త్వం
ఎలాంటిదో (నీ) జ్ఞానం ఎవరిదో (నీ) వేదం
ఎలావుందో (నీ) బంధం ఏమైనదో (నీ) ధ్యానం
ఏదానిదో (నీ) కార్యం ఎందరిదో (నీ) కాలం
ఎచ్చరికదో (నీ) సౌఖ్యం ఏకాంతదో (నీ) శూన్యం
ఎలావుంటివో (నీ) స్వప్నం ఎలావున్నావో (నీ) నిత్యం
ఎలావచ్చెదవో (నీ) మర్మం ఎలావెళ్ళెదవో (నీ) గాత్రం
No comments:
Post a Comment