అంతా రామమయం! ... ఈ జగమంతా రామమయం
అంతా రామమయం! ... ఈ విశ్వమంతా రామమయం
అంతా రామమయం! ... ఈ లోకమంతా రామమయం
అంతా రామమయం! ... ఈ జీవమంతా రామమయం
రామా శ్రీరామమయం శ్రీరామా రఘు రామమయం
రామా శ్రీరామమయం శ్రీరామా రఘు రామమయం
రామా శ్రీరామా ... రామా శ్రీరామా ... రామా శ్రీరామా ... రామా శ్రీరామా
రామా శ్రీరామా ... రామా శ్రీరామా ... రామా శ్రీరామా ... రామా శ్రీరామా || అంతా రామమయం! ||
శ్వాస ధ్యాస రామమయం వ్యాస భాష రామమయం
భూష వేష రామమయం యాస ప్రాస రామమయం
రూపం నాదం రామమయం దేహం గాత్రం రామమయం
దేశం ప్రాంతం రామమయం ధర్మం దైవం రామమయం
సర్వం పర్వం రామమయం సత్యం శాంతం రామమయం
యాగం యోగం రామమయం కావ్యం కార్యం రామమయం || అంతా రామమయం! ||
No comments:
Post a Comment