భావంతోనే కార్యాలోచన తత్వంతోనే కాలాలోచన
బంధంతోనే సమయాలోచన భవ్యంతోనే సందర్భాలోచన
రూపంతోనే సూర్యాలోచన నాదంతోనే స్వరాలోచన
విశ్వంతోనే విజ్ఞానాలోచన జగంతోనే విశుద్ధాలోచన
ఆలోచనలలో మహాలోచన ఆలోచనలే సహాలోచన
ఆలోచనలలో దివ్యాలోచన ఆలోచనలే సర్వాలోచన
ఆలోచనలే జీవన విధానం ఆలోచనలే జీవిత వైఖర్యం
ఆలోచనలే జీవన సాధనం ఆలోచనలే జీవిత సాఫల్యం || భావంతోనే ||
No comments:
Post a Comment