ప్రతి అణువు ఒక జీవమే
ప్రతి పరమాణువు ఒక పరజీవమే
ప్రతి అణువు పరమాణువు ఒక జీవ పదార్థమే ఒక దేహ పరమార్థమే
ప్రతి అణువు పరమాణువు ఒక రూప పదార్థమే ఒక జ్ఞాన పరమార్థమే
ప్రతి అణువు పరమాణువు భావన ఒక జీవన తత్త్వమే
ప్రతి అణువు పరమాణువు వేదన ఒక జీవిత యోగమే
ప్రతి అణువు జన్మించుటలో ఏదో ఒక విధాన సాధనమే
ప్రతి పరమాణువు జీవించుటలో ఏదో ఒక విభిన్న సాఫల్యమే
ప్రతి అణువు ఉదయించుటలో ప్రయోగాల ప్రయోజనాల ప్రతిరూపమే
ప్రతి అణువు ఉద్భవించుటలో పరిశోధనాల పరీక్షణాల ప్రతిఫలమే
ప్రతి అణువు నీయందు ఒక ఉపేక్షణమే ప్రతి పరమాణువు నీయందు ఒక ఉదాకరమే
No comments:
Post a Comment