నీలోనే నేనున్నాను పరమాత్మ
నీతోనే నేనున్నాను పరంధామ
నీవెంటే నేనున్నాను పద్మనాభ
నీచెంతే నేనున్నాను పరంజ్యోతి
నీలాగే నేనున్నాను ప్రకాశిత
నీరూపే నేనున్నాను ప్రభవితృ
నీయందే నేనున్నాను ప్రజల్పన
నీముందే నేనున్నాను ప్రదర్శన
నీజాడై నేనున్నాను ప్రజ్ఞానన
నీదాన్నై నేనున్నాను ప్రసాదన
నీవైపే నేనున్నాను పరాక్రమ
నీకేగా నేనున్నాను పరస్పర
నీకేలే నేనున్నాను ప్రకంపన
నీరాకే నేనున్నాను ప్రయోజన
ఎవరి కొరకై ఎవరున్నా నీకొరకై ఒకరున్నారని విశ్వమందు సూర్యోదయమే సువర్ణ కిరణాలతో పంచభూతాలుగా నీకు ప్రతిసారి నిన్ను దర్శించి స్పర్శించి తెలుపుతున్నది మహదేవా || నీలోనే ||
No comments:
Post a Comment