గమ్యం ఎక్కడో తెలియదు నా భావాలకు
గాయమైన ఏమి తెలుపదు నా తత్త్వాలకు
కాలమైన తెలుపనివ్వదు నా ఆలోచనలకు
కార్యమైన తెలియనివ్వదు నా ప్రయత్నాలకు
క్షణములెన్నో సమయమైనా సాగనివ్వదు నా రహదారి ఎటువైపు
సమయాలెన్నో కాలమైనా తాకనివ్వదు నా పాదదారి అటువైపు
ఏ దారి కలుపదు నా కార్యాలను అంతిమ గమ్యానికి
ఏ దారి నడపదు నా కృత్యాలను ఆఖరి గమ్యానికి
No comments:
Post a Comment