Thursday, June 19, 2025

జీవితాలు మారిపోవాలని ప్రతి మానవుడు ఎదురు చూస్తున్నాడు

జీవితాలు మారిపోవాలని ప్రతి మానవుడు ఎదురు చూస్తున్నాడు ప్రతి రోజు ఆలోచిస్తున్నాడు  

కొందరు శ్రమిస్తున్నారు కొందరు ప్రయత్నిస్తున్నారు కొందరు కొత్తగా ఆలోచిస్తున్నారు కొందరు ఎదురు చూస్తున్నారు కొందరు ఇతరులపై  ఆధారపడి ఉన్నారు కొందరు ప్రార్థిస్తున్నారు కొందరు పొదుపు చేస్తున్నారు కొందరు విఫలమౌతున్నారు కొందరు కొన్నింటిని మార్చుకున్నారు కొందరు కొన్నింటిని వదిలేసుకున్నారు కొందరు కొత్త వ్యాపారం చేస్తున్నారు కొందరు వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయారు కొందరు అలాగే మరణించారు కొందరు అలాగే ఉండిపోయారు 
కొందరే అభివృద్ధిని సాధించారు కొందరు ఓడిపోతూ ఇతరులను గెలిపించారు కొందరు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు 

కొందరి శ్రమకు ఫలితం లేకుండా పోతున్నది కొందరికి సలహా సహాయం అందకుండా పోతున్నది కొందరికి ఖర్చులు పెరుగుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి రోజు ఒక్కటే ప్రతి రోజు ఒకే విధంగా ఉదయిస్తున్నానని సూర్యోదయం తెలుపుతున్నది

ప్రతి రోజు ఒక్కటే ప్రతి రోజు ఒకే విధంగా ఉదయిస్తున్నానని సూర్యోదయం తెలుపుతున్నది 
సూర్యుడు ఉదయించుటలో ఏ విభేదం లేదు ప్రతి రోజు సాగే సమయంలో ఏ మార్పు లేదు   

కాలంతో వచ్చే ఋతువులే మన భావ తత్వాలలో మార్పులను కలిగిస్తూ జీవితంలో ఎన్నో కార్యాలు ఎన్నో విధాలా ప్రతి రోజు వివిధ రకాలుగా సాగిస్తాయి సాగిపోతాయి సాగుతూనే ఉంటాయి 

ఋతువులు కాలంతో వచ్చే మార్పులే కాదు అనుభవాలను అందించే మహా విజ్ఞాన ప్రబోధాలు 

ఋతువుల ద్వారా మన మేధాశక్తి విధానం మారుతుంది వివిధ అనుభవాల ద్వారా మన శక్తి సామర్థ్యాలు మన జీవన విధానాలు అన్నీ మారిపోతాయి 

వర్షం నుండి ఆహారం కలుగుతుంది , ఎండ [సూర్య రష్మి] నుండి శరీర నిరోధక శక్తి కలుగుతుంది, చలి నుండి శరీరం వివిధ స్థితి స్థాయిని మార్చుకుంటుంది, గాలి నుండి రక్షణకై వసతి నిర్మాణం మారుతుంది - ఇలా ఎన్నో మార్పులు కలుగుతూనే మానవుడు అన్నింటిని గ్రహిస్తూ విజ్ఞానంతో అనుభవాలను ఎదుర్కొంటూ అభివృద్ధిని సాధించేందుకు సాధన చేస్తూ జీవిస్తాడు   

కాలంతో పాటు ఋతువులే కాకుండా విశ్వంలో సహజమైన అలజడులు [భూప్రకంపనాలు, వరదలు, తుఫానులు, అగ్ని పర్వతాలు, సుడిగుండాలు, మొదలైనవి] అప్పుడప్పుడు కలుగుతుంటాయి  

-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, June 18, 2025

మన నేత్రాలు విశ్వ కార్యాలను తిలకిస్తున్నాయి మన చెవులు విశ్వ కార్యాల శబ్దాలను వినిపించుకుంటున్నాయి

మన నేత్రాలు విశ్వ కార్యాలను తిలకిస్తున్నాయి మన చెవులు విశ్వ కార్యాల శబ్దాలను వినిపించుకుంటున్నాయి 

తిలకించుటలో ఏకాగ్రతతో పాటు అవగాహన కలుగుతూ కార్యాల అర్థాన్ని గమనిస్తూ విజ్ఞానాన్ని సేకరిస్తుంది 
కనిపించుటలో అజాగ్రత్తలను పొరపాటులను గుర్తిస్తుంది విజ్ఞానాన్ని అజ్ఞానాన్ని విశదీకరిస్తుంది 

వినిపించుటలో శబ్దాల అనుసరణతో వివిధ కార్యాలను చూడలేకున్నను వివిధ రకాలుగా గుర్తించేలా మేధస్సులో ఎన్నింటినో గ్రహిస్తుంది శబ్దాల ఆధారంగా అపాయాలను అజాగ్రత్తలను తెలుసుకుంటుంది  


-- వివరణ ఇంకా ఉంది!

ఇంత వరకు ఎంత కాలం వృధా ఐనదో తెలుసుకుంటే నీ ఐశ్వర్యం తెలుపుతుంది

ఇంత వరకు ఎంత కాలం వృధా ఐనదో తెలుసుకుంటే నీ ఐశ్వర్యం తెలుపుతుంది 

నీవు నీ విజ్ఞానాన్ని ఎంతగా నేర్చుకున్నావు ఎంతగా శ్రమించి గ్రహించినావు నీ ఐశ్వర్య స్థితి స్థాయి తెలుపుతుంది 

జీవితంలో అభివృద్ధి లేకపోతే ఐశ్వర్యం కూడా శూన్యమైపోతుంది 

విజ్ఞానం కోసం ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం అనుబంధం కోసం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి కుటుంబాన్ని గౌరవించుకోవాలి సుఖ సంతోషాలను పంచుకోవాలి సమాజాన్ని విజ్ఞానవంతంగా చూడాలి అవసరమైతే పరిశుద్ధంగా ప్రజ్ఞానంగా ప్రకృతి స్వచ్చతతో పరిపూర్ణంగా మార్చాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

ఏనాటి భావ తత్వాలో ఈనాటికి తెలిపే విజ్ఞాన స్వభావాలు మేధస్సులో ధారాళంగా కలుగుతున్నాయి

ఏనాటి భావ తత్వాలో ఈనాటికి తెలిపే విజ్ఞాన స్వభావాలు మేధస్సులో ధారాళంగా కలుగుతున్నాయి  

ఆనాటి ఈనాటి రాబోయే తరానికి కావలసిన విజ్ఞాన స్వభావాల భావ తత్వాలు అనంతమై విశ్వమంతా వివిధ రూపాలలో ప్రకృతి ఆకారాలలో సకల జీవరాసులలో వివిధ కార్యాలచే చుట్టుకున్నాయి అలాగే ఉద్భవిస్తున్నాయి 

ఏ విజ్ఞానాన్ని నేర్చినా ఎంత నేర్చినా తెలియనివి అనంతమై నేర్చుకొనుటకు వీలులేనట్లుగా శ్రమించుటకు సమయం చాలనట్లుగా ప్రజ్ఞాన భావ తత్వాలు వివిధ రకాలుగా వివిధ సమయాలలో పెరుగుతున్నాయి అనుభవాలకు అందకుండా సాగుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

నీవు విజ్ఞానంతో ఎదిగిపోతూ ఉంటే అభివృద్ధి చెందుతూ ఉంటే మీ వాళ్ళందరూ నిన్ను తలచుకొని గౌరవించుకుంటారు

నీవు విజ్ఞానంతో ఎదిగిపోతూ ఉంటే అభివృద్ధి చెందుతూ ఉంటే మీ వాళ్ళందరూ నిన్ను తలచుకొని గౌరవించుకుంటారు 

విజ్ఞానం సామాన్యమైనది కాని దానిని పరమార్ధంతో గ్రహించడం అసాధారణ సాధనతో అపారమైన ఏకాగ్రతతో కూడిన పరిశోధనం లాంటిది 


-- వివరణ ఇంకా ఉంది!

ఎన్ని వేదాలు నేర్చినా ఎన్ని భావాలు తెలుసుకున్నా ఎన్ని తత్వాలు ధరించినా జీవించుటలో శ్రమించడం ఆగదు

ఎన్ని వేదాలు నేర్చినా ఎన్ని భావాలు తెలుసుకున్నా ఎన్ని తత్వాలు ధరించినా జీవించుటలో శ్రమించడం ఆగదు విజ్ఞానం కోసం పరిశోధన ఆగదు నిరంతరం నేర్చుకునే జ్ఞాన అన్వేషణ ఏ మేధస్సు విశ్రాంతికై సుఖానికై ఆగదు  


-- వివరణ ఇంకా ఉంది!

చదువుకోలేదని ఏనాడు నిరాశ చెందకు కార్యక్రమాలపై అవగాహన ఉంటే చాలు జీవితానికి కావలసిన అనుభవాన్ని నేర్పుతుంది

చదువుకోలేదని ఏనాడు నిరాశ చెందకు కార్యక్రమాలపై అవగాహన ఉంటే చాలు జీవితానికి కావలసిన అనుభవాన్ని  నేర్పుతుంది  

ఆనాటి మహాత్ములు [కొందరు] చదువుకోలేదు అలాగని నిరాశ చెందలేదు కార్యాలపై అవగాహన పెంచుకొని ఉత్తమమైన విధానాన్ని ఎంచుకొని మహా జ్ఞానులుగా అవతరించారు అనుభవాలతో జీవితాన్ని సాగించారు ఎన్నో పాఠాలను అనుభవాలతో నేర్చుకున్నారు ఎంతో భవిష్య విజ్ఞానాన్ని అవగాహనతో పరిశోధించారు 

ఆనాటి మహాత్ములు సత్యం ధర్మం న్యాయం శ్రమయం సుగుణం స్వచ్ఛత సాధారణ ప్రకృతి పరిశుద్ధత విశ్వం శరీర ప్రభావం దేహ విధాన భావ తత్వాలు జీవ బంధాలు జీవన విధానాలు వీటినే పరిశోధిస్తూ అనంతమైన అవగాహనతో జీవితాన్ని సాగించారు 


-- వివరణ ఇంకా ఉంది!

అనారోగ్యంగా ఉన్నప్పుడు మన ఊపిరిని మన శరీరంలోని అన్ని అవయవాలకు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రశాంతంగా పంపించాలి

అనారోగ్యంగా ఉన్నప్పుడు మన ఊపిరిని మన శరీరంలోని అన్ని అవయవాలకు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో "ప్రశాంతంగా" పంపించాలి 

ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నా అవయవాలకు లేదా వాటి శరీర భాగాలకు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను పంపించాలి 

ఊపిరిని ప్రశాంతంగా పంపిస్తూ ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను క్షణ్ణంగా పదిహేను [15] నిమిషాలు గమనిస్తూ ఉండాలి  [ఆహారం సంతృప్తి కరంగా స్వచ్ఛమైన సహజమైన దానిని తీసుకోవాలి]

ప్రతి రోజు రెండు సార్లు [ఉదయం, సాయంత్రం] పదిహేను నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను గమనిస్తే అనారోగ్యం పదిహేను రోజులలో కాస్త నయం [ఆరోగ్యవంతం] కావచ్చు [ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను వజ్రాసనం వేస్తూ గమనించవచ్చు]


-- వివరణ ఇంకా ఉంది!

ఆహార పదార్థాలు గుమగుమలాడాలి అలాగే ఆహార పదార్థాల వ్యర్థములు పదపదలాడాలి

ఆహార పదార్థాలు గుమగుమలాడాలి అలాగే ఆహార పదార్థాల వ్యర్థములు పదపదలాడాలి [పదపదవెళ్ళాలి] 

ఆహార పదార్థాలను ఎప్పుడూ తాజాగా ఉంచాలి ఆరోగ్యవంతంతమైన సువాసనలతో పరిమళించాలి 

ఆహార పదార్థాలను తాజాదనాన్ని కోల్పోక ముందే ఆరగించాలి అలాగే వాటిని సమయానికి అమ్ముకోవాలి [విక్రయించాలి] - కాని సమాజంలో ఎంతో వ్యర్థమౌతున్నది 

ఆహారాన్ని తయారు చేసేటప్పుడు [వండుటకు కావలసిన విధంగా మార్చుకున్నప్పుడు] తొలగించిన వ్యర్థాన్ని ఎవరికి కనపడకుండా పదపదమంటూ దూర ప్రాంతానికి తరలించాలి 

ఆహార పదార్థాల చుట్టూ పరిశుద్ధత పరిశుభ్రత ఎల్లప్పుడూ ఉండాలి వాటిని ఉపయోగించే విధానం కూడా పవిత్రంగా ఉండాలి అలాగే ఆహారాన్ని భుజించేటప్పుడు శుచి శుభ్రత విధానాన్ని పాటించాలి ఆహారాన్ని వృధా కాకుండా చూసుకోవాలి ఆరోగ్యాన్ని ఆయుస్సును పెంచుకోవాలి శక్తి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలి విజ్ఞానాన్ని గ్రహిస్తూనే ఉండాలి నిరంతరం జాగ్రత్త వహిస్తూనే ఉండాలి అవగాహనతోనే [ఎరుకతో] కార్యక్రమాలను సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, June 17, 2025

లక్ష స్వభావములు కలవాడు లక్షణములు కలవాడు - లక్ష తత్వములు కలవాడు లక్ష గుణములు కలవాడు

లక్ష స్వభావములు కలవాడు లక్షణములు కలవాడు - లక్ష తత్వములు కలవాడు లక్ష గుణములు కలవాడు  

ఎన్ని స్వభావాలైనా ఎన్ని తత్వములైనా ఎన్ని లక్షణములైనా ఎన్ని గుణములైనా విజ్ఞానంతో కూడిన విధంగా వివిధ కార్యాలతో వినయంగా సాగాలి 

మానవుడు పరిశుద్ధమైన సత్ప్రవర్తనుడుగా [నిరంతరం] జీవించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

మన మేధస్సు తనకు తానుగా దానికదే భావ తత్వాలను కల్పించుకొని విజ్ఞానాన్ని అవగాహనతో గమనిస్తూ పరిశోధిస్తూ సేకరిస్తుంది

మన మేధస్సు తనకు తానుగా దానికదే భావ తత్వాలను కల్పించుకొని విజ్ఞానాన్ని అవగాహనతో గమనిస్తూ పరిశోధిస్తూ సేకరిస్తుంది  

ఆలోచనల ప్రభావం భాషపై ఆధారపడి ఉంటుంది అలాగే మన కార్యక్రమాలతో మేధస్సులో ప్రభావాన్ని చూపుతుంది 

ఆలోచనల అర్థాన్ని విజ్ఞానంగా మార్చుకుంటూ మేధస్సును అభివృద్ధి కార్యక్రమాలతో సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

మనది మనది అంటూ అనుకుంటూనే ఉంటే ఒకానొకప్పుడు ఎవరికో వెళ్ళిపోతుంది

మనది మనది అంటూ అనుకుంటూనే ఉంటే ఒకానొకప్పుడు [ఎప్పుడో ఒకప్పుడు] ఎవరికో వెళ్ళిపోతుంది 
ఎప్పుడో ఒకప్పుడు మనదే మన నుండి వెళ్ళిపోతే మనదంటూ ఎప్పుడూ ఏముంటుంది  [ఏదుంటుంది]

అలాగే నాది నాది అనుకుంటూ ఉంటే నిన్ను నీవే నీ దేహాన్ని ఎప్పుడో ఒకప్పుడు తెలిసి తెలియనట్లుగా అస్తమించిపోతావు అలాగే నీది నీవు అనుకున్నవన్నీ వదిలిపోతావు 

అన్నీ అందరి నుండి వెళ్ళిపోతాయని మౌనంగా నిశ్చలంగా ఉండకూడదు నిరంతరం శ్రమిస్తూ మనకు కావలసిన వాటిని మనకు మన వాళ్ళ కోసం ఆరోగ్యం కోసం విజ్ఞానం కోసం ప్రకృతి పరిశుద్ధత అభివృద్ధి కోసం వినయంతో గౌరవంతో సంపాదించుకోవాలి సమపాలలో పంచుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

నీవు తెలియని వారి మధ్య ఉన్నప్పుడు నిన్ను చూస్తూనే ఎందరో నిన్ను మరచిపోతారు

నీవు తెలియని వారి మధ్య ఉన్నప్పుడు నిన్ను చూస్తూనే ఎందరో నిన్ను మరచిపోతారు 

నీవు తెలిసిన వారి మధ్య ఉన్నప్పుడు నాలుగురైన నీ గురించి ఆలోచిస్తూ నీ మేలు [అభివృద్ధి] కోరుకుంటారు  

నలుగురిలో [తెలియని వారి మధ్యలో] ఉన్నప్పుడు విజ్ఞానవంతంగా ప్రవర్తించుకుంటే ఎందరో నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు నీ సిద్ధాంతాలను తరతరాలుగా పాటిస్తారు 


-- వివరణ ఇంకా ఉంది!

ఆనాటి అమూల్యమైన భావ తత్వాలను వదులుకోవద్దు రాబోయే కాలంలో కలిగే భావ తత్వాలను పరిశీలించకుండా స్వీకరించవద్దు

ఆనాటి అమూల్యమైన భావ తత్వాలను వదులుకోవద్దు [మరచిపోవద్దు] రాబోయే కాలంలో కలిగే భావ తత్వాలను  పరిశీలించకుండా స్వీకరించవద్దు [గ్రహించవద్దు]

నేటి భావ తత్వాలు అశాశ్వితమైన తాత్కాలికమైన అవస్ధతతో కూడిన అకాల సమయానికి కలిగేలా ఉంటాయి 

స్వచ్ఛమైన భావ తత్వాలు పరిశుద్ధమైన ప్రజ్ఞానమైన అత్యవసరమైన సద్గుణాల అనుబంధంతో కూడి ఉంటాయి 


-- వివరణ ఇంకా ఉంది!

తెలుగు భాష నిండు కుండ లాంటిది - అమృతంతో నిండిన కలశం లాంటిది

తెలుగు భాష నిండు కుండ లాంటిది - అమృతంతో నిండిన కలశం లాంటిది  

మధురమైన అమృతంతో అనంతమైన దివ్యమైన సుగుణాల భావ తత్వాలతో దాగిన సువర్ణ సుగంధం దాగిన కలశం లాంటిది తెలుగు భాష  

తెలుగు భాష పరిపూర్ణమైనది సహజమైన స్వచ్ఛమైన ప్రకృతి ప్రబోధమైన ప్రతేజమైన శాస్త్రీయ సిద్ధాంతంతో ప్రజ్ఞానవంతమైన భావ తత్వాలతో పరిశోధనమైనది 

తెలుగు భాష అమూల్యమైన పర్వత శిఖరాలలో ప్రకాశించే తేజోవంతమైన క్షేత్రం [అఖండ గోపురం] లాంటిది 


-- వివరణ ఇంకా ఉంది! 

ఆలోచన ఉంటే సరిపోదు ఆరోగ్యం ఉండాలి మిత్రమా

ఆలోచన ఉంటే సరిపోదు ఆరోగ్యం ఉండాలి మిత్రమా 

జీవించుటలో ఎదగడానికి ఆరోగ్యంతో పాటు ధైర్యం శక్తి సామర్థ్యాలు విజ్ఞాన నైపుణ్యాలు లౌకిక జ్ఞానం ఉండాలి  

ఆలోచనతోనే ఆరోగ్యం విజ్ఞానం అభివృద్ధి ప్రాప్తిస్తుంది 

ఆలోచనలకు గమనంతో పాటు శ్రమించడం తెలిస్తే ఏ కార్యమైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Monday, June 16, 2025

పరమాత్ముడు తెలుగు భాషలోని భావ తత్వాలు ప్రీతికరమని మధురమైనవని విశ్వానికి తెలిపేను జగమంతా తలిచేను

పరమాత్ముడు తెలుగు భాషలోని భావ తత్వాలు ప్రీతికరమని మధురమైనవని విశ్వానికి తెలిపేను జగమంతా తలిచేను  

పరమాత్ముని వర్ణించే భావ తత్వాలు అమృత కలశం లాంటి పరిశుద్ధమైన సుగుణ సుగంధములు సుభోగములు 


పరమాత్ముని పద్మనాభములు పద్మభూషణ విశ్వ విభూషణగా అవతరించిన ప్రకృతి పంచభూతములు లలితశ్రీ పుష్పములు పద్మశ్రీ పదజాలములు 

పరమాత్ముని దర్శనములు సూర్యోదయ కాంతి దివ్య తేజముల సువర్ణ కిరణాల సంపంగి కుసుమములు నేత్రానందనములు 


-- వివరణ ఇంకా ఉంది!

మానవుని జీవన విధానంలో ఆచరణ సిద్ధాంతం లేకపోతే పరిశుద్ధత పవిత్రత ప్రజ్ఞానత సత్ప్రవర్తన ఏవీ ఉండవు

మానవుని జీవన విధానంలో ఆచరణ సిద్ధాంతం లేకపోతే పరిశుద్ధత పవిత్రత ప్రజ్ఞానత సత్ప్రవర్తన ఏవీ ఉండవు 

ఏ సమయానికి ఏది చేయాలో తెలుసుకోవాలి ఆచరించాలి దాని పరిశుద్ధత విజ్ఞానాన్ని గ్రహిస్తూ జీవన విధానాన్ని మెరుగు పరచాలి అలాగే తరతరాల వారికి అందించాలి [ఆచరణ సాంప్రదాయాలతో సంస్కారవంతంతో గౌరవంతో పవిత్రతతో విజ్ఞానంతో పూజ్యోదయంతో అభివృద్ధి చెందాలి]


-- వివరణ ఇంకా ఉంది!

పంచభూతాలతోనే అవతరించిన ప్రకృతి పంచభూతాలకే ఆవహించిపోతుంది

పంచభూతాలతోనే అవతరించిన ప్రకృతి పంచభూతాలకే ఆవహించిపోతుంది 

ప్రకృతి పంచభూతాలను శుద్ధి చేస్తుంది అలాగే పంచభూతాలతో కలిసిపోతూ మళ్ళీ స్వచ్ఛతను తిరిగి తెచ్చుకుంటుంది 

ప్రకృతి శక్తి పంచభూతాలలో ఉన్నట్లు పంచభూతాల శక్తి ప్రకృతిలో నిమగ్నమై ఉండిపోతుంది 

ప్రకృతిలోని అలజడులను పంచభూతాలు వశం [స్వాధీనం] చేసుకుంటాయి 
ప్రకృతి అలజడులు చాలా భయంకరంగా ఏ జీవి అదుపు చేయలేనట్లు  ఏ జీవి ఒకటిగా [ఒంటరిగా] రక్షించుకోలేనట్లు విధ్వంసాన్ని సృష్టిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

విశ్వ విజ్ఞానమంతా మేధస్సులోనే ఉన్నా ఎప్పుడు అస్తమిస్తుందో వయస్సుకే తెలియని ఆరోగ్యంతో జీవిస్తున్నా

విశ్వ విజ్ఞానమంతా మేధస్సులోనే ఉన్నా ఎప్పుడు అస్తమిస్తుందో వయస్సుకే తెలియని ఆరోగ్యంతో జీవిస్తున్నా  

మేధస్సులోని విజ్ఞానం పరిమితమే ఐనా నిరంతరం నవ విజ్ఞానం మేధస్సులో అపారమై శుద్ధత్వంతో చేరుతున్నది 

ఎవరికి ఎలా తెలిపినా ఎన్నో భావ తత్వాలు వివరించినా అపారమైన విశ్వ విజ్ఞానం ఎవరి వయసుకు తోచని జీవ బంధాల ప్రకృతి సారాంశమంతా పరమాత్మలోనే మర్మమై ఉండిపోతున్నది [కాలంతో ప్రతి క్షణం పరమాత్ముని విశ్వ మేధస్సులోనే చేరిపోతున్నది]


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, June 12, 2025

ప్రయాణించుటలో ఎంత జాగ్రత్త వహించినా చోదకుడు వాహనం నడిపే తీరు పైననే మనం గమ్యాన్ని చేరుకునే విధానం ఉంటుంది

ప్రయాణించుటలో ఎంత జాగ్రత్త వహించినా చోదకుడు వాహనం నడిపే తీరు పైననే మనం గమ్యాన్ని చేరుకునే విధానం ఉంటుంది  

వాహనం యొక్క యంత్ర స్థితి పైనను మనం గమ్యాన్ని చేరుకునే విధానం ఆధారపడి ఉంటుంది 

రహదారిలో మనతో పాటు ప్రయాణిస్తూ వాహనాలను నడిపే చోదకుల విధానం [తీరు, రీతి] ద్వారా కూడా మనం గమ్యాన్ని చేరుకునే విధానం ఉంటుంది 

వాతావరణ పరిస్థితి కూడా మనం గమ్యాన్ని చేరుకునేందుకు అనుకూలించాలి 

ఏ వాహనానికి ఏ [మరో] వాహనం తగలకుండా అంటకుండా చోదకులు జాగ్రత్త వహించాలి [వాహనాన్ని నడిపే విధానం సురక్షితంగా ఉండాలి] - ప్రయాణిస్తున్నప్పుడు ప్రశాంతత, మెళకువ, సంతోషం, విజ్ఞానం, నమ్మకం, ఉత్తేజం, అవగాహన, ధైర్యం ఉండాలి    

ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యంగా రహదారి నియమాలను తప్పకుండా పాటించాలి 

ప్రయాణించుటలో రక్షక భటులను చూస్తే భయపడకూడదు [భయపడితే గుండే వేగం పెరిగి వాహనం అదుపు తప్పుతుంది ప్రమాదానికి గురి చేస్తుంది]

రక్షక భటులు అనవసరంగా వాహనాలను ఆపుతూ అనవసరమైన ధనాన్ని వసూలు చేస్తారు అందుకే వాహనాన్ని నడిపే చోదకులకు భయం వేస్తుంది 

వాహనాలను నడిపేటప్పుడు ముఖ్యంగా ఎక్కువ వేగంతో ప్రయాణించరాదు 
వాహనానికి తగ్గ మనుషులు లేదా సరుకులు వీలుగా ఉండే బరువుతో ప్రయాణాన్ని సాగించాలి 
వాహనానికి తగ్గ ఇంధనం యంత్ర పరిస్థితిని ప్రయాణానికి ముందే చూసుకోవాలి అవసరమైన యంత్ర పరికరాలను ఉంచుకోవాలి 

వీలైతే ప్రథమ చికిత్సకు లేదా భద్రత కోసం కావలసిన వాటిని వాహనంలో ఉంచుకోవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!

విశ్వమంతా పరిశుద్ధంగా ప్రజ్ఞానంగా పవిత్రంగా ఉన్నప్పుడే పరమాత్ముడు అవతరిస్తాడు

విశ్వమంతా పరిశుద్ధంగా ప్రజ్ఞానంగా పవిత్రంగా ఉన్నప్పుడే పరమాత్ముడు అవతరిస్తాడు 

విశ్వమంతా పరిశుద్ధంగా ఉండాలంటే మానవులోనే మార్పు రావాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

సత్ప్రవర్తన లేని చోట పరిశుద్ధత ప్రజ్ఞానత పవిత్రత ఉండదు

సత్ప్రవర్తన లేని చోట పరిశుద్ధత ప్రజ్ఞానత పవిత్రత ఉండదు ఆ సుగుణ భావన తత్వం కలగదు  

మాట్లాడే విధానంలో సద్భావన తత్వం ఉండాలి 
వస్తువులను ఉపయోగించే విధానంలో పరిశుద్ధత పరిశుభ్రత పవిత్రత ప్రజ్ఞానత ప్రాముఖ్యత ఉండాలి 

-- వివరణ ఇంకా ఉంది!

ఒంటరిగా జీవిస్తున్నప్పుడే మన సామర్థ్యం తెలుస్తుంది

ఒంటరిగా జీవిస్తున్నప్పుడే మన సామర్థ్యం తెలుస్తుంది 

ఒంటరిగా జీవిస్తున్నప్పుడు మన ఆలోచన విధానాలు విజ్ఞానవంతంగా ధైర్యవంతంగా లక్ష్యంకై సాధన చేస్తూ సాధించేలా ఉండాలి 

మనకు కావలసిన వాటిని మనమే సమకూర్చుకోవాలి ప్రతి కార్యంలో జాగ్రత్త వహించాలి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా ఆహార నియమాలు పాఠించాలి 

సమాజంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ కారణం చేతనైన మోసపోరాదు 

ప్రతి విషయాన్ని వివేకవంతంతో ఆలోచిస్తూ విజ్ఞానాన్ని గ్రహిస్తూ ముందుకు సాగాలి 

మనకు ఉన్న సమస్యలు గుర్తుకు వస్తున్నప్పుడు ధ్యాసను విజ్ఞానం వైపు మార్చేస్తూ పరిస్కారాలను గ్రహించాలి 
సమస్యలకు పరిష్కారాలు కొన్ని స్వల్ప కాలంలో మరికొన్ని అధిక కాలంలో మరికొన్ని అనుకోని కాలంలో సంభవిస్తాయి [సమస్యలు తీరిపోతాయి] కొన్ని సమస్యలు అలాగే మిగిలిపోతాయి 

కొన్ని సమస్యలు పరిష్కారింపబడకపోతే నిరుత్సాహం చెందక వేరే సమస్యలుగా [కోరికలుగా] మార్చుకోవాలి 

కొన్ని సమస్యలు ఇతరుల ద్వారా తీరిపోతాయి కొన్ని సమస్యలు ఇతరుల ద్వారా పెరుగుతాయి 
కొన్ని సమస్యలకు అర్థాలు ఉండవు 

విజ్ఞానవంతమైన ఉపయోగవంతమైన సమస్యలనే [కోరికలనే, లక్ష్యాలనే] ఎంచుకోవాలి 

మనలోనే ఆలోచనల విధానంతో పాటు విజ్ఞానం పెరుగుతూ [అభివృద్ధి చెందుతూ] ఉండాలి ఐశ్వర్యవంతంగా ఆరోగ్యవంతంగా ఎదగాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

ఊపిరిని స్మరణం చేస్తూ ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను శాంతంతో ఎంతగా ఆడిస్తే అంతటి ప్రశాంతమైన ఆరోగ్యం కలుగుతుంది

ఊపిరిని స్మరణం చేస్తూ ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను శాంతంతో ఎంతగా ఆడిస్తే అంతటి ప్రశాంతమైన ఆరోగ్యం కలుగుతుంది జీవం [దేహం] దీర్ఘాయుస్సుతో జీవిస్తుంది 

 
-- వివరణ ఇంకా ఉంది! 

అనంత మేఘాల వర్షం నుండే విశ్వ ప్రకృతి పరిశుద్ధమై స్వచ్ఛమైన ప్రాణ వాయువును సహజమైన వాతావరణాన్ని పత్రహరితమైన అభివృద్ధిని జగతికి అందిస్తుంది

అనంత మేఘాల వర్షం నుండే విశ్వ ప్రకృతి పరిశుద్ధమై స్వచ్ఛమైన ప్రాణ వాయువును సహజమైన వాతావరణాన్ని పత్రహరితమైన అభివృద్ధిని జగతికి అందిస్తుంది  

మేఘాలు పరిశుద్ధమైన జలాశయ నిధులు పరిపూర్ణమైన ప్రవాహ వర్ష పాతములు 


-- వివరణ ఇంకా ఉంది!

Without Standard Salaries how to consider the MNC (Multi National Company) in the Society or in the World.

Without Standard Salaries how to consider the MNC (Multi National Company) in the Society or in the World.

More than 3 years of experience talents in the same company and not getting good salary how it considered as Employee Satisfaction and how employee (he/she) will consider this is the MNC organization.

As a employee he/she need to fulfill roles and responsibilities in the Organization, according to Job Level and also same in the home/family with basic needs and important's.


How to solve the problems in the organization and the same way how to survive the family with basic needs is important in home.


-- Still need more explanation/discussion to understand!

Wednesday, June 11, 2025

సమాజం నిన్ను నడిపిస్తే నీవు సమాజాన్ని నడిపించాలి

సమాజం నిన్ను ఎలా నడిపించినా నీవు సమాజాన్ని స్వచ్ఛమైన పరిశుద్ధమైన పరిపూర్ణమైన విజ్ఞానంతో నడిపించాలి  


-- వివరణ ఇంకా ఉంది!

సత్యాన్ని నీవు నడిపిస్తే సర్వం నిన్ను నడిపిస్తుంది

సత్యాన్ని నీవు నడిపిస్తే సర్వం నిన్ను నడిపిస్తుంది 
సత్యంతో నీవు నడుచుకుంటే సర్వం నీతో నడుస్తుంది  


-- వివరణ ఇంకా ఉంది!

విజ్ఞానంలో పరిశుద్ధత ఉంటే చాలదు ప్రవర్తనలో కూడా పరిశుద్ధత ఉండాలి

విజ్ఞానంలో పరిశుద్ధత ఉంటే చాలదు ప్రవర్తనలో కూడా పరిశుద్ధత ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

ముందడుగు వేసే వరకు వెనుకడుగు వేయకు

ముందు అడుగు వేసే వరకు వెనుక అడుగు వేయకు  


-- వివరణ ఇంకా ఉంది!

ఎంత విజ్ఞానం ఉన్నను నిన్ను అజ్ఞానం వరిస్తుంది ఎంత అజ్ఞానం ఉన్నను నిన్ను విజ్ఞానం నడిపిస్తుంది

ఎంత విజ్ఞానం ఉన్నను నిన్ను అజ్ఞానం వరిస్తుంది ఎంత అజ్ఞానం ఉన్నను నిన్ను విజ్ఞానం నడిపిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది1 

ఆరోగ్యం ఐశ్వర్యం విజ్ఞానం అనుబంధం సహనం సంతోషం అభివృద్ధి ఉంటేనే సంతానం

ఆరోగ్యం ఐశ్వర్యం విజ్ఞానం వ్యాయామం అవగాహన అనుబంధం సహనం నైపుణ్యం సంతోషం శ్రమ సామర్థ్యం అభివృద్ధి పరిశోధన పరిష్కారం ఉంటేనే సంతానం 



-- వివరణ ఇంకా ఉంది!

ఆకాశం ఎంత ఎత్తులో ఉన్నా భయం లేదు మిత్రమా అంతస్తులను చూస్తూనే అమితమైన భయం వేస్తున్నది

ఆకాశం ఎంత ఎత్తులో ఉన్నా భయం లేదు మిత్రమా అంతస్తులను చూస్తూనే అమితమైన భయం వేస్తున్నది  


-- వివరణ ఇంకా ఉంది 

Tuesday, June 10, 2025

ఆలోచనలతో ఆలోచిస్తే ఆశ్చర్యం మేధాశక్తితో పరిశోధిస్తే అద్భుతం

ఆలోచనలతో ఆలోచిస్తే ఆశ్చర్యం మేధాశక్తితో పరిశోధిస్తే అద్భుతం 
అవగాహనతో ఊహించుకుంటే అమోఘం పరమార్ధంతో పరిశీలిస్తే అమూల్యం  

ఆలోచిస్తే ఆశ్చర్యం ఆచరిస్తే అద్భుతం 
ఆశ్రయిస్తే అమోఘం అనుకూలిస్తే ఆరోగ్యం 

ఆలోచన - ఎన్నో విధాలా ఎన్నింటినో ఎన్నో ప్రాంతాలలో [విజ్ఞానంతో, అనుభవంతో] ఆలోచించాలి 
ఆచరణ - ఎన్నో పద్ధతులతో ఎన్నో సిద్ధాంతాలను ఎన్నో రకాలుగా [ఎక్కడెక్కడో, ఎందరెందరితో] తెలుసుకోవాలి 
ఆశ్రయం - ఎందరికో ఎన్నో తరాలుగా ఆశ్రయాన్ని [సురక్షిత సదుపాయాల వసతి] అందించాలి 
అనుకూలత - ఎన్నింటినో జాగ్రత్తగా గ్రహిస్తూ ఎంతో విజ్ఞానంతో ఎంతో సమన్వయంతో సాధించాలి 

-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, June 4, 2025

సూర్యోదయంతో అనారోగ్యం శూన్యం ఆరోగ్యం అనంతం

సూర్యోదయంతో అనారోగ్యం శూన్యం ఆరోగ్యం అనంతం 


-- వివరణ ఇంకా ఉంది!

మానవుడు మరుపు జీవి - మానవుని మరుపు అనంతం విజ్ఞానం అల్పం

మానవుడు మరుపు జీవి 
మానవుని మరుపు  [అజ్ఞానం] అనంతం విజ్ఞానం [ఎరుక, జ్ఞాపకం] అల్పం 

ఏది నేర్చుకున్న ఎంత నేర్చుకున్నా జ్ఞాపకం అల్పం 
ఏ కార్యాన్ని చేసినా ఎన్ని కార్యాలు చేసినా జ్ఞాపకం అల్పం అనుభవం అల్పం నైపుణ్యం అల్పం 

ఎంత గొప్పవాడయినా ఎంతగా అభివృద్ధి [ఆర్థికంగా] చెందుతున్నా జ్ఞాపకం అల్పం 
ఎంత వయస్సు వున్నా ఎంతగా ఎదుగుతున్నా ఎంతటి వారైనా తమ జ్ఞాపకం అల్పం 
 
ఎంత మేధావిగా ఎదుగుతున్నా ఎంత మహాత్ముడుగా ఎదుగుతున్నా ఎంతటి మహర్షుడికైనా జ్ఞాపకం అల్పం 
ఎంత ప్రయాణం చేసినా ఎన్ని కొత్త విధానాలు నేర్చినా ఎన్నో విధాల అనుభవం పొందినా తన జ్ఞాపకం అల్పం

ఏ ప్రాంతంలో ఉన్నా ఎన్ని ప్రదేశాలు తిరిగినా జ్ఞాపకం అల్పం 
ఎందరితో ఉన్నా ఒక్కడిగా ఉన్నా తనలో దాచుకున్న జ్ఞాపకం అల్పం 

ఎంత సాధన చేసినా ఎన్ని సార్లు పునర్విమర్శ [గమనం] చేసుకున్నా జ్ఞాపకం అల్పం 
ఎంత కాలం జీవించినా ఎన్ని విజయాలు సాధించినా తనలోని నిలిచే జ్ఞాపకం అల్పం 

ఇంటి [గృహం] నుండి బయటకు ఏ కార్యానికైనా ఏ ప్రయాణానికైనా బయలు దేరితే ఎన్నో లేదా ఎదో మరచిపోతుంటాము [మరచిపోయినవి ఎప్పుడు గుర్తుకు వస్తాయో తెలియదు ఎలా పరిష్కారించాలో తెలియదు - వీటి వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో తెలియదు] [కొన్ని సంధర్భాలలో చేసిన తనిఖీనే పలుసార్లు చేస్తుంటాం ఎందుకంటే వాటిని మరచిపోకూడదు - ఉదాహరణకు: నీరు, పొయ్యి / కుంపటి, వంటచెరకు, వ్యర్థ పదార్ధం,  విద్యుత్తు, తాళం]

ముఖ్యమైన కార్యాలలో కూడా ఎన్నో మరచిపోతాం [ఉదాహరణకు: పరీక్షలకు వెళ్ళేటప్పుడు పరీక్షలు వ్రాసేటప్పుడు, వైద్యశాలలో ఔషధాలు, చికిత్సకు సంబంధించినవి, ఉద్యోగ రిత్యా, వ్యాపార రిత్యా లేదా వివిధ కార్యాలకు వివిధ కార్యాలయాలకు వెళ్ళేటప్పుడు]

వస్తువునే మరచి పోవచ్చు సమాచారాన్నే మరచిపోవచ్చు వ్యక్తులనే మరచిపోవచ్చు 
సమాధానం తెలుసుకోవడం లేదా ఉత్తరవును రాబట్టడం లేదా ప్రశ్నించుట లేదా పరిష్కారాన్ని కనుగొనడం/ఇతరుల నుండి లేదా నీ నుండి రాబట్టుకోవడం మరచిపోవచ్చు 

ఏ వస్తువును ఎలా వాడాలి ఎక్కడ ఉంచాలి ఎవరు వాడాలి ఎప్పుడు వాడాలి ఎందుకు వాడాలి తెలుసుకోవాలి [వస్తువుల ఉపయోగాలు అలాగే నష్టాలు తెలుసుకోవాలి]
ఏ సమాచారాన్ని ఎలా గ్రహించాలి ఎవరు గ్రహించాలి ఎక్కడ గ్రహించాలి ఎలా ఉపయోగించాలి ఎవరితో ఎలా  సంభాషించాలి అన్నీ తెలుసుకోవాలి 

తీసుకోవడం మరచిపోవచ్చు ఇవ్వడం మరచిపోవచ్చు వెళ్ళడం మరచిపోవచ్చు అవసరం లేకున్నా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు 

ప్రతి రోజు మనం చేయవలసిన కార్యాలను వ్రాసుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే ఏమి చేయాలో తెలుస్తాయి ఏవి మరచిపోరాదో తెలుస్తాయి అలాగే ఆ కార్యాలను జ్ఞాపకంతో సక్రమంగా ముగించుకుంటాము 

అవగాహన ప్రణాళిక సమయస్పందన కార్యాచరణ కార్యాక్రమణ కార్యాకారణ సిద్ధాంతం కార్యసిద్ధి కార్యసామగ్రి సమాచార ప్రసారం వ్యాఖ్యానం సార్థకమైన సంభాషణ ఇంద్రియ విచక్షణ కాల ఋతువుల స్థితి మార్పుల గ్రహణ అలాగే చుట్టూ జరిగే వాటిపై నిఘా గమన హిత భావన ప్రశాంత తత్వన అనుభవం విజ్ఞానం నైపుణ్యం ఎరుక జ్ఞాపకశక్తి ఇలా అన్నీ ప్రతి రోజు అన్ని వేళలా అన్ని కార్యాలకు ఉండాలి  - వీటికి కావాలి అనంతమైన జ్ఞాపకశక్తి 

ఆరోగ్య రక్షణ ప్రకృతి ఆహారాల [ఔషధాలు] అభివృద్ధి పరిశుద్ధమైన విశ్వ వాతావరణం విజ్ఞానవంతమైన సమాజం ఇలా ఎన్నో ప్రతి మానవునికి ప్రతి క్షణం ప్రతి రోజు అవసరం - వీటికి కావాలి అనంతమైన జ్ఞాపకశక్తి 

మానవుని జీవన విధానం తెలుసుకోవడం సులభం కాని విశ్వ విజ్ఞానంతో పరిపూర్ణవంతంగా పరమాత్మ తత్వంతో దివ్యమైన ప్రకృతి భావాలతో ఆచరించడం అసాధారణం 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, June 3, 2025

తెలిసినవన్నీ తెలియనట్లుగా తెలియనివన్నీ తెలిసినట్లుగా కార్యాలు సాగిపోతున్నాయి

తెలిసినవన్నీ తెలియనట్లుగా తెలియనివన్నీ తెలిసినట్లుగా కార్యాలు సాగిపోతున్నాయి 

ప్రశాంతంగా ఆలోచిస్తూ చూస్తే జరిగిన కార్యాలలో నీవు అనుకున్నట్లు జరిగేలా ఏ కార్యాలు నీ ఒక్కరి ద్వారా జరిగిపోవు - అలాగే కార్యాలన్నీ తెలిసినా తెలియనట్లుగా తెలియకున్నా తెలిసినట్లుగా నీతో జరిగిపోతాయి అలాగే నీవు లేకుండా నీ కార్యాలు సాగిపోతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

విశ్వమంతా ఏకమై జీవితమంతా కర్మను అనుభవించేలా కాలంతో పాటు సమయ కార్యాలు నిన్ను ప్రతిఫలం లేకుండా నడిపిస్తున్నాయి

విశ్వమంతా ఏకమై జీవితమంతా కర్మను అనుభవించేలా కాలంతో పాటు సమయ కార్యాలు నిన్ను ప్రతిఫలం లేకుండా నడిపిస్తున్నాయి 

ఏ కార్యాన్ని పరిశుద్ధంగా సాగించినా కార్య ఫలితం లేకుండా సాధారణ రీతిలో జీవితం సాగుతున్నది 

కార్యాలన్నీ కర్మ ఫలితాలే ఐతే జీవితంలో ఎదుగుదల అభివృద్ధి లేక సాధారణ జీవితం సాగుతుంది 

విజ్ఞానం ఆచరణలో లేకపోతే కార్యంలో సమయానికి విజయం లేకపోతే అసాధారణ శ్రమకు అసమానమైన నష్టంతో కూడిన ఫలితాన్ని జీవితానికి ఇస్తుంది  


-- వివరణ ఇంకా ఉంది! 

Sunday, June 1, 2025

ప్రతి మానవుడు విశ్వ కార్యాలతోనే జీవితాన్ని సాగించాలి

ప్రతి మానవుడు విశ్వ కార్యాలతోనే జీవితాన్ని సాగించాలి  



-- వివరణ ఇంకా ఉంది1