ఆశ పడితే ఉద్యోగమైనా ఉచిత ప్రసాదమైన లభించదు శ్రమించగలిగితేనే ఏదైనా లభిస్తుంది
ఆశ పడుతూ ఎంత కాలం ఎదురుచూసినా అనుకున్నది మనకు అందకుండా పోతూనే ఉంటుంది
శ్రమించగలిగితే మనం ఆశపడినవి అందుతాయి అలాగే అనుకోకుండా మనకు తెలియని కొన్ని ఆశలు వెంటనే తీరిపోతాయి
మనతో విజ్ఞానం ఐశ్వర్యం ఆరోగ్యం శ్రమించడం ఆశ్రయించడం [స్నేహత్వం] ఉంటే ఎటువంటి కోరికలైనా కొంత కాలానికి తీర్చుకోగలుగుతాము (కొన్ని కోరికలు వివిధ కారణాల వల్ల తీరకుండా పోతాయి - వాటిని ఎంత ఆశించినా మనకు అందకుండా పోతాయి)
మనం ఆశించిన కోరికలు కొన్ని సమయాలలో ఎదుటివారికి తీరిపోతాయి అలాగే వారు అభివృద్ధి చెందుతుంటారు
లోపాలు అందరిలో ఉంటాయి వాటిని అధిగమించడానికి వివేకవంతంతో శ్రమిస్తూ ఉంటే ఆశించిన కోరికలు తీరిపోవచ్చు
సమయానికి సమన్వయంతో శ్రమిస్తూ పోతే అన్నీ సమకాలానికి సమయోచితంగా వివిధ సందర్భాలలో తీరిపోతాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment