Thursday, June 19, 2025

జీవితాలు మారిపోవాలని ప్రతి మానవుడు ఎదురు చూస్తున్నాడు

జీవితాలు మారిపోవాలని ప్రతి మానవుడు ఎదురు చూస్తున్నాడు ప్రతి రోజు ఆలోచిస్తున్నాడు  

కొందరు శ్రమిస్తున్నారు కొందరు ప్రయత్నిస్తున్నారు కొందరు కొత్తగా ఆలోచిస్తున్నారు కొందరు ఎదురు చూస్తున్నారు కొందరు ఇతరులపై  ఆధారపడి ఉన్నారు కొందరు ప్రార్థిస్తున్నారు కొందరు పొదుపు చేస్తున్నారు కొందరు విఫలమౌతున్నారు కొందరు కొన్నింటిని మార్చుకున్నారు కొందరు కొన్నింటిని వదిలేసుకున్నారు కొందరు కొత్త వ్యాపారం చేస్తున్నారు కొందరు వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయారు కొందరు అలాగే మరణించారు కొందరు అలాగే ఉండిపోయారు 
కొందరే అభివృద్ధిని సాధించారు కొందరు ఓడిపోతూ ఇతరులను గెలిపించారు కొందరు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు 

కొందరి శ్రమకు ఫలితం లేకుండా పోతున్నది కొందరికి సలహా సహాయం అందకుండా పోతున్నది కొందరికి ఖర్చులు పెరుగుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి రోజు ఒక్కటే ప్రతి రోజు ఒకే విధంగా ఉదయిస్తున్నానని సూర్యోదయం తెలుపుతున్నది

ప్రతి రోజు ఒక్కటే ప్రతి రోజు ఒకే విధంగా ఉదయిస్తున్నానని సూర్యోదయం తెలుపుతున్నది 
సూర్యుడు ఉదయించుటలో ఏ విభేదం లేదు ప్రతి రోజు సాగే సమయంలో ఏ మార్పు లేదు   

కాలంతో వచ్చే ఋతువులే మన భావ తత్వాలలో మార్పులను కలిగిస్తూ జీవితంలో ఎన్నో కార్యాలు ఎన్నో విధాలా ప్రతి రోజు వివిధ రకాలుగా సాగిస్తాయి సాగిపోతాయి సాగుతూనే ఉంటాయి 

ఋతువులు కాలంతో వచ్చే మార్పులే కాదు అనుభవాలను అందించే మహా విజ్ఞాన ప్రబోధాలు 

ఋతువుల ద్వారా మన మేధాశక్తి విధానం మారుతుంది వివిధ అనుభవాల ద్వారా మన శక్తి సామర్థ్యాలు మన జీవన విధానాలు అన్నీ మారిపోతాయి 

వర్షం నుండి ఆహారం కలుగుతుంది , ఎండ [సూర్య రష్మి] నుండి శరీర నిరోధక శక్తి కలుగుతుంది, చలి నుండి శరీరం వివిధ స్థితి స్థాయిని మార్చుకుంటుంది, గాలి నుండి రక్షణకై వసతి నిర్మాణం మారుతుంది - ఇలా ఎన్నో మార్పులు కలుగుతూనే మానవుడు అన్నింటిని గ్రహిస్తూ విజ్ఞానంతో అనుభవాలను ఎదుర్కొంటూ అభివృద్ధిని సాధించేందుకు సాధన చేస్తూ జీవిస్తాడు   

కాలంతో పాటు ఋతువులే కాకుండా విశ్వంలో సహజమైన అలజడులు [భూప్రకంపనాలు, వరదలు, తుఫానులు, అగ్ని పర్వతాలు, సుడిగుండాలు, మొదలైనవి] అప్పుడప్పుడు కలుగుతుంటాయి  

-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, June 18, 2025

మన నేత్రాలు విశ్వ కార్యాలను తిలకిస్తున్నాయి మన చెవులు విశ్వ కార్యాల శబ్దాలను వినిపించుకుంటున్నాయి

మన నేత్రాలు విశ్వ కార్యాలను తిలకిస్తున్నాయి మన చెవులు విశ్వ కార్యాల శబ్దాలను వినిపించుకుంటున్నాయి 

తిలకించుటలో ఏకాగ్రతతో పాటు అవగాహన కలుగుతూ కార్యాల అర్థాన్ని గమనిస్తూ విజ్ఞానాన్ని సేకరిస్తుంది 
కనిపించుటలో అజాగ్రత్తలను పొరపాటులను గుర్తిస్తుంది విజ్ఞానాన్ని అజ్ఞానాన్ని విశదీకరిస్తుంది 

వినిపించుటలో శబ్దాల అనుసరణతో వివిధ కార్యాలను చూడలేకున్నను వివిధ రకాలుగా గుర్తించేలా మేధస్సులో ఎన్నింటినో గ్రహిస్తుంది శబ్దాల ఆధారంగా అపాయాలను అజాగ్రత్తలను తెలుసుకుంటుంది  


-- వివరణ ఇంకా ఉంది!

ఇంత వరకు ఎంత కాలం వృధా ఐనదో తెలుసుకుంటే నీ ఐశ్వర్యం తెలుపుతుంది

ఇంత వరకు ఎంత కాలం వృధా ఐనదో తెలుసుకుంటే నీ ఐశ్వర్యం తెలుపుతుంది 

నీవు నీ విజ్ఞానాన్ని ఎంతగా నేర్చుకున్నావు ఎంతగా శ్రమించి గ్రహించినావు నీ ఐశ్వర్య స్థితి స్థాయి తెలుపుతుంది 

జీవితంలో అభివృద్ధి లేకపోతే ఐశ్వర్యం కూడా శూన్యమైపోతుంది 

విజ్ఞానం కోసం ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం అనుబంధం కోసం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి కుటుంబాన్ని గౌరవించుకోవాలి సుఖ సంతోషాలను పంచుకోవాలి సమాజాన్ని విజ్ఞానవంతంగా చూడాలి అవసరమైతే పరిశుద్ధంగా ప్రజ్ఞానంగా ప్రకృతి స్వచ్చతతో పరిపూర్ణంగా మార్చాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

ఏనాటి భావ తత్వాలో ఈనాటికి తెలిపే విజ్ఞాన స్వభావాలు మేధస్సులో ధారాళంగా కలుగుతున్నాయి

ఏనాటి భావ తత్వాలో ఈనాటికి తెలిపే విజ్ఞాన స్వభావాలు మేధస్సులో ధారాళంగా కలుగుతున్నాయి  

ఆనాటి ఈనాటి రాబోయే తరానికి కావలసిన విజ్ఞాన స్వభావాల భావ తత్వాలు అనంతమై విశ్వమంతా వివిధ రూపాలలో ప్రకృతి ఆకారాలలో సకల జీవరాసులలో వివిధ కార్యాలచే చుట్టుకున్నాయి అలాగే ఉద్భవిస్తున్నాయి 

ఏ విజ్ఞానాన్ని నేర్చినా ఎంత నేర్చినా తెలియనివి అనంతమై నేర్చుకొనుటకు వీలులేనట్లుగా శ్రమించుటకు సమయం చాలనట్లుగా ప్రజ్ఞాన భావ తత్వాలు వివిధ రకాలుగా వివిధ సమయాలలో పెరుగుతున్నాయి అనుభవాలకు అందకుండా సాగుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

నీవు విజ్ఞానంతో ఎదిగిపోతూ ఉంటే అభివృద్ధి చెందుతూ ఉంటే మీ వాళ్ళందరూ నిన్ను తలచుకొని గౌరవించుకుంటారు

నీవు విజ్ఞానంతో ఎదిగిపోతూ ఉంటే అభివృద్ధి చెందుతూ ఉంటే మీ వాళ్ళందరూ నిన్ను తలచుకొని గౌరవించుకుంటారు 

విజ్ఞానం సామాన్యమైనది కాని దానిని పరమార్ధంతో గ్రహించడం అసాధారణ సాధనతో అపారమైన ఏకాగ్రతతో కూడిన పరిశోధనం లాంటిది 


-- వివరణ ఇంకా ఉంది!

ఎన్ని వేదాలు నేర్చినా ఎన్ని భావాలు తెలుసుకున్నా ఎన్ని తత్వాలు ధరించినా జీవించుటలో శ్రమించడం ఆగదు

ఎన్ని వేదాలు నేర్చినా ఎన్ని భావాలు తెలుసుకున్నా ఎన్ని తత్వాలు ధరించినా జీవించుటలో శ్రమించడం ఆగదు విజ్ఞానం కోసం పరిశోధన ఆగదు నిరంతరం నేర్చుకునే జ్ఞాన అన్వేషణ ఏ మేధస్సు విశ్రాంతికై సుఖానికై ఆగదు  


-- వివరణ ఇంకా ఉంది!

చదువుకోలేదని ఏనాడు నిరాశ చెందకు కార్యక్రమాలపై అవగాహన ఉంటే చాలు జీవితానికి కావలసిన అనుభవాన్ని నేర్పుతుంది

చదువుకోలేదని ఏనాడు నిరాశ చెందకు కార్యక్రమాలపై అవగాహన ఉంటే చాలు జీవితానికి కావలసిన అనుభవాన్ని  నేర్పుతుంది  

ఆనాటి మహాత్ములు [కొందరు] చదువుకోలేదు అలాగని నిరాశ చెందలేదు కార్యాలపై అవగాహన పెంచుకొని ఉత్తమమైన విధానాన్ని ఎంచుకొని మహా జ్ఞానులుగా అవతరించారు అనుభవాలతో జీవితాన్ని సాగించారు ఎన్నో పాఠాలను అనుభవాలతో నేర్చుకున్నారు ఎంతో భవిష్య విజ్ఞానాన్ని అవగాహనతో పరిశోధించారు 

ఆనాటి మహాత్ములు సత్యం ధర్మం న్యాయం శ్రమయం సుగుణం స్వచ్ఛత సాధారణ ప్రకృతి పరిశుద్ధత విశ్వం శరీర ప్రభావం దేహ విధాన భావ తత్వాలు జీవ బంధాలు జీవన విధానాలు వీటినే పరిశోధిస్తూ అనంతమైన అవగాహనతో జీవితాన్ని సాగించారు 


-- వివరణ ఇంకా ఉంది!

అనారోగ్యంగా ఉన్నప్పుడు మన ఊపిరిని మన శరీరంలోని అన్ని అవయవాలకు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రశాంతంగా పంపించాలి

అనారోగ్యంగా ఉన్నప్పుడు మన ఊపిరిని మన శరీరంలోని అన్ని అవయవాలకు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో "ప్రశాంతంగా" పంపించాలి 

ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నా అవయవాలకు లేదా వాటి శరీర భాగాలకు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను పంపించాలి 

ఊపిరిని ప్రశాంతంగా పంపిస్తూ ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను క్షణ్ణంగా పదిహేను [15] నిమిషాలు గమనిస్తూ ఉండాలి  [ఆహారం సంతృప్తి కరంగా స్వచ్ఛమైన సహజమైన దానిని తీసుకోవాలి]

ప్రతి రోజు రెండు సార్లు [ఉదయం, సాయంత్రం] పదిహేను నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను గమనిస్తే అనారోగ్యం పదిహేను రోజులలో కాస్త నయం [ఆరోగ్యవంతం] కావచ్చు [ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను వజ్రాసనం వేస్తూ గమనించవచ్చు]


-- వివరణ ఇంకా ఉంది!

ఆహార పదార్థాలు గుమగుమలాడాలి అలాగే ఆహార పదార్థాల వ్యర్థములు పదపదలాడాలి

ఆహార పదార్థాలు గుమగుమలాడాలి అలాగే ఆహార పదార్థాల వ్యర్థములు పదపదలాడాలి [పదపదవెళ్ళాలి] 

ఆహార పదార్థాలను ఎప్పుడూ తాజాగా ఉంచాలి ఆరోగ్యవంతంతమైన సువాసనలతో పరిమళించాలి 

ఆహార పదార్థాలను తాజాదనాన్ని కోల్పోక ముందే ఆరగించాలి అలాగే వాటిని సమయానికి అమ్ముకోవాలి [విక్రయించాలి] - కాని సమాజంలో ఎంతో వ్యర్థమౌతున్నది 

ఆహారాన్ని తయారు చేసేటప్పుడు [వండుటకు కావలసిన విధంగా మార్చుకున్నప్పుడు] తొలగించిన వ్యర్థాన్ని ఎవరికి కనపడకుండా పదపదమంటూ దూర ప్రాంతానికి తరలించాలి 

ఆహార పదార్థాల చుట్టూ పరిశుద్ధత పరిశుభ్రత ఎల్లప్పుడూ ఉండాలి వాటిని ఉపయోగించే విధానం కూడా పవిత్రంగా ఉండాలి అలాగే ఆహారాన్ని భుజించేటప్పుడు శుచి శుభ్రత విధానాన్ని పాటించాలి ఆహారాన్ని వృధా కాకుండా చూసుకోవాలి ఆరోగ్యాన్ని ఆయుస్సును పెంచుకోవాలి శక్తి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలి విజ్ఞానాన్ని గ్రహిస్తూనే ఉండాలి నిరంతరం జాగ్రత్త వహిస్తూనే ఉండాలి అవగాహనతోనే [ఎరుకతో] కార్యక్రమాలను సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!