Saturday, April 19, 2025

సూర్యుడు ఆకాశమంతా దివ్య స్వరూపమై ఉదయిస్తున్నా మేధస్సులో విచక్షణకు మెళకువ కలగటలేదా మానవా!

సూర్యుడు ఆకాశమంతా దివ్య స్వరూపమై  ఉదయిస్తున్నా మేధస్సులో విచక్షణకు మెళకువ కలగటలేదా మానవా!

విశ్వమంతా జీవరాసులన్నీ భావ తత్వాలతోనే సూర్యోదయానికి మునుపే మేలుకుంటూ దినచర్య కార్యాలను ఉత్తేజవంతంతో ప్రారంభిస్తాయి 

మానవులకు ఆలోచన గమనం విజ్ఞానం ఉన్నా మెలకువలో ఆలస్యం ఉత్తేజంతో ఆలస్యం కార్యారంభంలో ఆలస్యమౌతున్నది 

మానవ మేధస్సులో విజ్ఞానవంతమైన విచక్షణ ఉత్తేజవంతమైన ఆలోచనల ఆచరణ ఉంటేనే కార్యాలు క్రమక్రమంగా  సత్ఫలితాలిస్తాయి 

మానవుడు ప్రకృతిని అవగాహన చేసుకుంటూ ఆలోచనలతో తిలకిస్తూ ఏకాగ్రతతో విజ్ఞానం చెందుతూ జీవన విధానాన్ని విశ్వ అభివృద్ధితో పరిశుద్ధంగా సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment